News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: మొహాలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొట్టింది! బ్యాటింగ్‌కు స్వర్గధామమైన వికెట్‌పై అమేజింగ్‌ బౌలింగ్‌ చేసింది. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి (5/51) ఐదు వికెట్లతో ఆసీస్‌ను కంగారు పెట్టాడు.

FOLLOW US: 
Share:

IND vs AUS 1st ODI: 

మొహాలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొట్టింది! బ్యాటింగ్‌కు స్వర్గధామమైన వికెట్‌పై అమేజింగ్‌ బౌలింగ్‌ చేసింది. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి (5/51) ఐదు వికెట్లతో ఆసీస్‌ను కంగారు పెట్టాడు. అతడికి మిగిలిన బౌలర్లు తోడవ్వడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లకు 278 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (52; 53 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీ సాధించాడు. జోష్‌ ఇంగ్లిస్‌ (45; 45 బంతుల్లో 3x4, 2x6), స్టీవ్‌ స్మిత్‌ (41; 60 బంతుల్లో 3x4, 2x6) అతడికి తోడుగా రాణించారు.

డేవిడ్‌ భాయ్ ధమాకా

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ 4 పరుగుల వద్దే ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (4)ను మహ్మద్‌ షమి పెవిలియన్‌ పంపించాడు. అతడు వేసిన పుల్లర్‌ లెంగ్త్‌ షార్ట్‌ బాల్‌ను మార్ష్‌ ఆఫ్‌స్టంప్‌ మీద డిఫెండ్‌ చేయబోయి శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడారు. రెండో వికెట్‌కు 106 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేసిన డేవిడ్‌ భాయ్‌ అందివచ్చిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. 49 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు.

స్మిత్‌ అదే నిలకడ

అత్యంత ప్రమాదకరంగా మారిన వార్నర్‌ను రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వెళ్తున్న బంతిని మోకాళ్లపై కూర్చొని స్లాగ్‌స్వీప్‌ చేయాలని వార్నర్‌ ప్రయత్నించాడు. బంతి కాస్త బౌన్స్‌ అవ్వడంతో బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేవడంతో గిల్‌ చక్కగా అందుకున్నాడు. అప్పటికి ఆసీస్‌ స్కోరు 98. మరోవైపు భారత పిచ్‌పై చక్కని అవగాహన కలిగిన స్టీవ్‌ స్మిత్‌ నెమ్మదిగా ఆడాడు. ఒక్కో బంతిని ఆడుతూ పోయాడు. ఎక్కడా అనవసర షాట్లు ఆడేందుకు ప్రయత్నించలేదు. టీమ్‌ఇండియాను ఇబ్బంది పెడుతున్న అతడిని మహ్మద్ షమి ఔట్‌ చేశాడు. అతడు వేసిన బంతి బ్యాటు, ప్యాడ్లకు మధ్యలోంచి వెళ్లి లెగ్‌వికెట్ ఎగరగొట్టింది. దాంతో కంగారూలు 112 పరుగులకు 3 వికెట్లు చేజార్చుకున్నారు.

విలువైన భాగస్వామ్యాలు

మధ్యలో మార్నస్‌ లబుషేన్‌ (39), కామెరాన్‌ గ్రీన్‌ (31) విలువైన ఇన్నింగ్సులు ఆడారు. నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం సాధించారు. నిలదొక్కుకున్న ఈ జోడీని లబుషేన్‌ను స్టంపౌట్‌ చేయడం ద్వారా కేఎల్‌ రాహుల్‌ విడదీశాడు. మరికాసేపటికే గ్రీన్‌ రనౌట్‌ అయ్యాడు. అప్పటికి ఆసీస్‌ స్కోరు 39.3 ఓవర్లకు 186. ఈ సిచ్యువేషన్లో హల్క్‌ ఆల్‌రౌండర్‌  స్టాయినిస్‌ (29; 21 బంతుల్లో 5x4), జోస్‌ ఇంగ్లిష్ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూనే అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. 43 బంతుల్లోనే 62 పరుగుల పాట్నర్‌షిప్‌ అందించారు. ఇంగ్లిస్‌ను బుమ్రా, స్టాయినిస్‌ను బుమ్రా ఔట్‌ చేశారు. ఆఖర్లో ప్యాట్‌ కమిన్స్‌ (21*; 9 బంతుల్లో 2x4, 1x6) మెరుపుల మెరిపించడంతో ఆసీస్‌ 276కి చేరుకుంది. బుమ్రా, యాష్‌, జడ్డూకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ ప్రమాణాలకు తగ్గట్టు లేదు.

Published at : 22 Sep 2023 05:33 PM (IST) Tags: KL Rahul David Warner India vs Australia ABP Desam breaking news IND vs AUS

ఇవి కూడా చూడండి

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

BAN vs NZ: చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర

BAN vs NZ: చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర

IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?

IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?

Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్‌-10

Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్‌-10

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×