అన్వేషించండి

IND vs AFG: భారత్ ముందు 159 పరుగుల లక్ష్యం

India vs Afghanistan 1st T20I: అఫ్గాన్‌ తో జరుగుతున్న మూడు మ్యాచుల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకు పరిమితం చేసారు.

అఫ్గాన్‌ తో జరుగుతున్న మూడు మ్యాచుల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకు పరిమితం చేసారు. అక్షర్ పటేల్ తో పాటూ ముఖేష్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 50 పరుగుయా భాగస్వామ్యం అందించారు.. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. అదే స్కోర్ వద్ద మరో ఓపెనర్ ను శివమ్‌ దూబే పెవిలియన్ కు పంపాడు. దీనితో 50 పరుగుల వద్ద అఫ్గాన్‌ 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఓంరజాయ్ 22 బంతుల్లో 29 పరుగులు, మహ్మద్ నబీ 27 బంతుల్లో 42 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మిగిలిన బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. టీం ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్‌  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 

మూడు మ్యాచుల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా(Team India).. అఫ్గాన్‌(Afghanistan)ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. పంజాబ్‌(Punjab) లోని మొహాలీ(mohali) వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్‌ బరిలోకి దిగింది. 14 నెలల తర్వాత పొట్టి క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ శర్మ(Rohit Sharma) తిరిగి ఈ ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతలు చేపట్టనుండటంతో ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ తీసుకుంది. 

భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్‌ దూబే, జితేష్, రింకూసింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్ సింగ్‌, ముఖేష్ కుమార్‌.
 
అఫ్గానిస్థాన్‌ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్,  గుల్బాదిన్ నాయబ్,  షరఫుద్దీన్ అష్రాఖ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్
 
ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కంటే ముందు భారత్‌ ఆడనున్న చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14 నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీ(Virat Kohli)పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)కు ముందు చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. 
 
అఫ్గానిస్తాన్‌ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కీలక ఆటగాడు, స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ లేకుండా ఆ జట్టు బరిలోకి దిగుతోంది. గత ఏడాది వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్‌ ఖాన్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్ద పెద్ద జట్లను ఓడించి అఫ్గానిస్తాన్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget