అన్వేషించండి

India Smashes Record Total: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భార‌త్ అరుదైన రికార్డు.. ఆ ఫీట్ సాధించిన రెండో టీమ్ గా ఘ‌న‌త‌!

ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నెదర్లాండ్స్‌ను 95 రన్స్ తేడాతో ఓడించి ఇండియా వరల్డ్ కప్ లో హిస్టారికల్ విక్టరీ సాధించింది. దీంతో అరుదైన క్ల‌బ్ లో చోటు ద‌క్కించుకుంది. 

Smriti Mandhana and Shafali Verma Sizzle With Bat: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ బంప‌ర్ విక్టరీ నమోదు చేసింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఇండియా 95 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 రన్స్ భారీ స్కోరు చేసింది. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండియాకు ఇది హైయెస్ట్ టోటల్ కావడం విశేషం. వరల్డ్ కప్ మ్యాచ్ లో 200 రన్స్ మార్కును క్రాస్ చేసిన రెండో టీమ్‌గా ఇండియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన (47 బంతుల్లో 74), షఫాలీ వర్మ (38 బంతుల్లో 55) డచ్ బౌలింగ్ అటాక్‌ను కంప్లీట్‌గా దెబ్బతీశారు. వీరిద్దరూ ఫస్ట్ వికెట్‌కు కేవలం 70 బంతుల్లోనే 115 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేసి మ్యాచ్‌ను వన్-సైడెడ్ గా మార్చేశారు.

Read Also: Akshara Gupta Triple Century:  మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. కేవలం 126 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం.. బిహార్ నుంచి లేడీ విధ్వంస‌క క్రికెట‌ర్,  సోషల్ మీడియా షేక్!

షఫాలీ విధ్వంసం, మంధాన క్లాస్ 
మ్యాచ్ స్టార్టింగ్‌లో షఫాలీ వర్మ చాలా అగ్రెసివ్‌గా ఆడింది. పవర్‌ప్లేలో ఇండియా వికెట్ నష్టపోకుండా 59 రన్స్ స్కోర్ చేసింది. డచ్ పేసర్ ఇసాబెల్ వోనింగ్ బౌలింగ్‌లో షఫాలీ కొట్టిన ఏరియల్ డ్రైవ్ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. షఫాలీ హిట్టింగ్ చూసి నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడ్ పదే పదే బౌలర్లను మార్చాల్సి వచ్చింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత స్మృతి మంధాన తన క్లాస్ గేమ్‌ను బయటకు తీసింది. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అందరినీ ఆడుకుంది. సిల్వర్ సీగర్స్ వేసిన 15వ ఓవర్లో మంధాన వరుసగా నాలుగు ఫోర్లు బాది స్టేడియంను హోరెత్తించింది. మంధానకు ఇది టోర్నీలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కాగా, షఫాలీకి ఇది ఫస్ట్ ఫిఫ్టీ. ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత జెమిమా, హర్మన్‌ప్రీత్ కౌర్ నిరాశపరిచినా, ఎండ్‌లో రిచా ఘోష్ (8 బంతుల్లో 20), దీప్తి శర్మ (2 బంతుల్లో 10) మెరుపు కమెయోలతో స్కోరును 209 కి చేర్చారు. ఈ మ్యాచ్ కోసం ఇండియా టీమ్‌లో రెండు చేంజెస్ చేసింది. భారతి ఫుల్మాలి ప్లేస్ లో యాస్తికా భాటియా, అరుంధతి రెడ్డి ప్లేస్ లో నందని శర్మ టీమ్ లోకి వచ్చారు.

Read Also: T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి

శ్రేయాంక పాటిల్ ఇంజరీ టెన్షన్
210 రన్స్ కొండంత టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీమ్ ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. టోటల్ గా 17.3 ఓవర్లలో 114 రన్స్ కే డచ్ టీమ్ ఆలౌట్ అయింది. ఇండియా తరఫున వరల్డ్ కప్ డెబ్యూ చేసిన పేసర్ నందని శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఓపెనర్ హీథర్ సీగర్స్‌ను అవుట్ చేసి ఇంటర్నేషనల్ కెరీర్ లో ఫస్ట్ వికెట్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత డచ్ కెప్టెన్ బాబెట్ డి లీడ్ (28) ను కూడా స్టంపౌట్ చేసి పంపించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియాకు ఒక బిగ్ షాక్ తగిలింది. యంగ్ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తను వేసిన ఫస్ట్ బాల్‌లోనే ఫీల్డింగ్ చేస్తూ యాంకిల్ (మడమ) ట్విస్ట్ అవ్వడంతో గాయపడింది. నొప్పితో విలవిలలాడిన శ్రేయాంకను స్ట్రెచ్చర్‌పై గ్రౌండ్ బయటకు తీసుకెళ్లడం ఇండియన్ క్యాంప్‌ను టెన్షన్ పెడుతోంది.

సౌతాఫ్రికాతో గండం
పాకిస్తాన్‌పై 5 వికెట్లతో చెలరేగిన దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లోనూ తన ఫస్ట్ ఓవర్లోనే ఫీబే మోల్కెన్‌బోయర్‌ను అవుట్ చేసింది. ఆ తర్వాత తెలుగు స్పిన్నర్ శ్రీ చరణి తన స్పిన్ మాయ‌తో నెదర్లాండ్స్ మిడిల్ ఆర్డర్‌ను కంప్లీట్‌గా కొలాప్స్ చేసింది. రాబిన్ రైజ్ వికెట్ తీసిన చరణి, 17వ ఓవర్లో హ్యాట్రిక్ ఛాన్స్ క్లోజ్‌గా మిస్ చేసుకుంది. షఫాలీ వర్మ కూడా బౌలింగ్‌లో మెరిసి స్టెర్రే కాలిస్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. డచ్ బ్యాటర్లలో బాబెట్, కాలిస్ (18) కొద్దిసేపు పోరాడినా లాభం లేకపోయింది. ఈ బిగ్ విక్టరీతో ఇండియా రన్ రేట్ భారీగా పెరిగింది. ఇండియా తన నెక్స్ట్ మ్యాచ్ లో జూన్ 21న మాంచెస్టర్ వేదికగా బలమైన సౌతాఫ్రికా టీమ్‌ను ఫేస్ చేయనుంది. ఈ టఫ్ ఫైట్ కోసం టీమిండియా ఇప్పుడే స్ట్రాటజీస్ సిద్ధం చేసుకుంటోందని అనలిస్టులు స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తే దాదాపుగా త‌ర్వాతి ద‌శ‌కు చేరుకుంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget