IND vs ENG 5th Test: చివరి టెస్టులో శార్దూల్, అన్షుల్ కాంబోజ్ ఔట్- కుల్దీప్, అర్షదీప్‌లకు ఛాన్స్.. మాజీ క్రికెటర్ ప్లేయింగ్ 11
Wasim jaffer India playing 11 | భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన 5వ టెస్ట్ జులై 31న ప్రారంభం కానుంది. ఓవల్ వేదికగా జరగనున్న చివరి టెస్టులో నెగ్గితేనే భారత్ సిరీస్ డ్రా చేసుకోగలుగుతుంది.

India vs England 5th Test News | ఓవల్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ భారత్ ఓడిపోకూడదంటే నిర్ణయాత్మక చివరి టెస్టులో నెగ్గాల్సి ఉంటుంది. ఓవల్ టెస్టులో భారత జట్టు నెగ్గితే సిరీస్ 2-2తో డ్రా అవుతుంది. లేకపోతే సచిన్ టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీని భారత్ కోల్పోక తప్పదు. భారత క్రికెట్ జట్టు 5వ టెస్ట్ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. చివరి టెస్టులో భారత జట్టులో ప్లేయింగ్ 11లో చాలా మార్పులు ఉండవచ్చు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మరో బౌలర్ ఆడతాడని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ భావిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరగనున్న 5వ టెస్టుకు వసీం జాఫర్ తన ప్లేయింగ్ 11 టీమ్‌ను ప్రకటించాడు.
మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ప్లేయింగ్ 11లో అన్షుల్ కంబోజ్‌కు ఛాన్స్ ఇవ్వలేదు. నాల్గవ టెస్ట్‌లో ఆ పేసర్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. చివరి జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌ను చేర్చాడు. అర్షదీప్ కనుక తుది జట్టులో అవకాశం దక్కించుకుంటే అతడి టెస్ట్ అరంగేట్రం అవుతుంది. ఇదే సిరీస్ లో ఇదివరకే సాయి సుదర్శన్, ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేశారు. సాయి సుదర్శన్‌కు జాఫర్ తన లిస్టులో నమ్మకంతో అవకాశం ఇచ్చాడు. అతను నాల్గవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే మొదటి ఓవర్‌లో డకౌట్ అయ్యాడు. సిరీస్ లో అరంగేట్రం మ్యాచ్ లోనూ తొలి ఇన్నింగ్స్ డకౌట్ తో మొదలుపెట్టాడు సాయి సుదర్శన్.
వసీం జాఫర్ ఎంచుకున్న టీమ్ ఇండియా ప్లేయింగ్ 11
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.
My India XI for Oval Test:
— Wasim Jaffer (@WasimJaffer14) July 30, 2025
1. Yashasvi
2. KL
3. Sai
4. Shubman (c)
5. Jurel (wk)
6. Jadeja
7. Washington
8. Kuldeep
9. Siraj
10. Arshdeep
11. Akashdeep
What's yours? #ENGvIND
శార్దూల్ ఠాకూర్‌కు నో ఛాన్స్, కుల్దీప్ యాదవ్ చేరిక
వసీం జాఫర్ తన ప్లేయింగ్ 11లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వలేదు. అవకాశం వచ్చినా శార్దూల్ ఠాకూర్ ప్రదర్శన కూడా అంత బాగోలేదు. అతను ఈ సిరీస్‌లో ఆడిన 2 టెస్ట్‌లలో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. మొదటి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో అతను 3 ఇన్నింగ్స్‌లలో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు.
ఓవల్ గ్రౌండ్‌లో భారత జట్టు రికార్డు
ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు ఇప్పటివరకూ 15 టెస్ట్‌లు ఆడింది. వీటిలో ఇండియా కేవలం 2 మ్యాచ్‌లలో మాత్రమే గెలవగా, ఇంగ్లాండ్ 5 మ్యాచ్‌లలో ఓడించింది. 1 మ్యాచ్‌లో భారత్ ఈ వేదికలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే భారత్ ఇక్కడ ఏకంగా 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్ గడ్డ మీద భారత్ విజయాలు అంత తేలిక కాదని ఏ వేదిక గణాంకాలు చూసినా అదే చెబుతున్నాయి.




















