News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND Vs WI: సిరీస్ వెస్టిండీస్‌దే - చివరి టీ20లో టీమిండియా ఘోర పరాజయం!

భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో వెస్టిండీస్ ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది.

FOLLOW US: 
Share:

వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. అనంతరం వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.

వెస్టిండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథంలో నడిపించాడు. నికోలస్ పూరన్ (47: 35 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) నుంచి తనకు చక్కటి సహకారం లభించింది. మరోవైపు భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.

ఊదేసిన వెస్టిండీస్...
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కైల్ మేయర్స్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో కైల్ మేయర్స్‌ను అర్ష్‌దీప్ బోల్తా కొట్టించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. అయితే భారత్‌కు ఆరంభ ఆనందమే మిగిలింది. ఎందుకంటే మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్, ప్రమోషన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన నికోలస్ పూరన్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. అక్కడక్కడా వర్షం అంతరాయం కలిగించినా వీరు ఎక్కడా తడబడలేదు. రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించి మ్యాచ్‌ను భారత్ దగ్గర నుంచి లాగేసుకున్నారు.

ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తిలక్ వర్మ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. తిలక్ వర్మకు ఇదే మొదటి అంతర్జాతీయ వికెట్. ఆ తర్వాత బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో వెస్టిండీస్ సిరీస్‌ను కూడా విజయం సాధించింది.

సూర్య, తిలక్ మినహా...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో టీ20లో శుభారంభం అందించిన శుభ్‌మన్ గిల్ (9: 9 బంతుల్లో, ఒక ఫోర్), యశస్వి జైస్వాల్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యారు. వీరిద్దరినీ అకియల్ హొస్సేన్ అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

ముఖ్యంగా తిలక్ వర్మ ఎంతో వేగంగా ఆడాడు. అవతలి ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ తనకు సహకారం అందించాడు. మూడో వికెట్‌కు వీరు 49 పరుగులు సాధించారు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో తిలక్ వర్మను రోస్టన్ ఛేజ్ రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ క్రీజులో నిలబడలేకపోయారు. కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. అయినంత వరకు సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడు. అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జేసన్ హోల్డర్... సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేశాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

Published at : 14 Aug 2023 12:55 AM (IST) Tags: Suryakumar Yadav West Indies IND vs WI India IND Vs WI 5th T20I

ఇవి కూడా చూడండి

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: రోహిత్‌ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్‌ సెంచరీ - టార్గెట్‌ దిశగా టీమ్‌ఇండియా!

IND vs AUS 3rd ODI: రోహిత్‌ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్‌ సెంచరీ - టార్గెట్‌ దిశగా టీమ్‌ఇండియా!

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

IND vs AUS 3rd ODI: ఇదేందయ్యా.. ఈ కొట్టుడేందయ్యా! 25 ఓవర్లకే ఆసీస్‌ 188/1

IND vs AUS 3rd ODI: ఇదేందయ్యా.. ఈ కొట్టుడేందయ్యా! 25 ఓవర్లకే ఆసీస్‌ 188/1

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది