అన్వేషించండి

IND Vs WI, Match Highlights: ‘సూర్య’ ప్రతాపానికి విండీస్ కుదేలు - భారత్ సిరీస్ ఆశలు సజీవం

IND Vs WI 3rd T20I: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌లో భారత్ జూలు విదిల్చింది. సూర్యకుమార్ యాదవ్ క్రేజీ ఇన్నింగ్స్‌తో సిరీస్‌లో భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి.

IND Vs WI, Match Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న  టీ20 సిరీస్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.  టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్  వీరోచిత ఇన్నింగ్స్ (44 బంతుల్లో 83, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)‌కు తోడు  ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి నిలకడైన ఆటతో  భారత్ మూడో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన  160 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు  మాత్రమే కోల్పోయి అలవోకగా  ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌లో విండీస్ ఆధిక్యాన్ని భారత్.. 1-2కు తగ్గించింది.

ఓపెనర్లు మారినా శుభారంభం దక్కలే.. 

160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు మరోసారి  ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి  టెస్టులలో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ (1) ను తీసుకొచ్చినా అతడు తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు.  రెండు బంతులే ఆడి అతడు ఒక్క పరుగు చేసిన అతడు.. మెక్‌కాయ్ వేసిన తొలి ఓవర్లోనే నాలుగో  బంతికే   భారీ షాట్ ఆడబోయి అల్జారీ జోసెఫ్ చేతికి చిక్కాడు.   11 బంతులాడిన శుభ్‌మన్ గిల్ ఆరు పరుగులే చేసి వైఫల్యాన్ని కొనసాగించాడు.  

సూర్య- తిలక్ షో.. 

యశస్వి నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆదినుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎదుర్కున్న తొలి రెండు బంతులను 4,6 గా మలిచిన  సూర్య.. ఇన్నింగ్స్ ఆసాంతం ఇదే దూకుడు కొనసాగించాడు. గిల్  ఔటయ్యాక వచ్చిన తిలక్ వర్మ‌తో కలిసి  స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. తిలక్ కూడా  పవర్ ప్లేలో దూకుడుగా ఆడాడు.  తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన అతడు.. ఆ తర్వాత   సూర్యకు అండగా నిలిచాడు. ఒబెడ్ మెక్‌కాయ్  వేసిన ఆరో ఓవర్లో సూర్య 4, 6 బాదగా తిలక్ కూడా బౌండరీ బాదాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. 

పవర్ ప్లే ముగిశాక కూడా  ఈ   ఇద్దరూ జోరు కొనసాగించారు.   రొమారియా షెపర్డ్ వేసిన 8వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన సూర్య.. 23 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేకున్నాడు. అతడే వేసిన పదో ఓవర్లో 6,4 కొట్టి భారత స్కోరును వంద పరుగులకు చేర్చాడు. సూర్య ధాటిగా ఆడటంతో  తిలక్ నెమ్మదించి అతడికే స్ట్రైక్ రొటేట్ చేస్తూ బాధ్యతాయుతంగా ఆడాడు. 70లలోకి వచ్చాక సూర్య మరింత రెచ్చిపోయాడు. అప్పటికే చిన్నగా చినుకులు మొదలుకావడంతో ఆటకు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉండటంతో  మ్యాచ్‌ను త్వరగా గించాలనే తొందర్లో  దూకుడు పెంచాడు. అల్జారీ జోసెఫ్  వేసిన 13వ ఓవర్లో  రెండో బంతిని సిక్సర్‌గా మలిచి  80లలోకి చేరిన  మిస్టర్ 360.. తర్వాత బంతికే ఫుల్ టాస్ బంతిని   బ్యాక్ షాట్ ఆడబోయి  ఫైన్ లెగ్ వద్ద ఉన్న బ్రాండన్ కింగ్ చేతికి చిక్కాడు. కానీ అప్పటికే భారత్  విజయం దాదాపు ఖాయమైంది. మూడో వికెట్‌కు సూర్య- తిలక్‌లు 87 పరుగులు జోడించారు. 

సూర్య స్థానంలో వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 20 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్).. తిలక్ వర్మతో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు.  షెపర్డ్ వేసిన  16వ ఓవర్లో తిలక్ వర్మ భారీ సిక్సర్ బాదగా.. చివరి బంతికి పాండ్యా ఫోర్ కొట్టాడు. పావెల్ వేసిన 18వ ఓవర్లో  ఐదో బంతికి హార్ధిక్ సిక్సర్ బాది  భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. 

అంతకుముందు వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.  బ్రాండన్ కింగ్ (42), కెప్టెన్ రోవ్మన్ పావెల్ (40 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో  కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో  నాలుగో టీ20 ఈనెల 12 (శనివారం) ఫ్లోరిడా (అమెరికా)లో జరుగుతుంది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
MohanBabu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Embed widget