అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs USA, T20 World Cup 2024:ఈ అయిదుగురితో తస్మాత్ జాగ్రత్త, నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం
IND vs USA T20 World Cup 2024 : పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అయిదుగురు ఆటగాళ్లు కీలకంగా మారారు. అద్భుత పోరాటంతో మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌ను మట్టికరించారు. వాళ్ళతో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి..
We have to be cautious of these 5 players: టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో ఆతిథ్య అమెరికా అదరగొడుతోంది. భారత్(India), అమెరికా(USA) ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అయిదుగురు ఆటగాళ్లు కీలకంగా మారారు. అద్భుత పోరాటంతో మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌ను మట్టికరించారు. కెనడాతోనూ జరిగిన మ్యాచ్‌లోనూ వీరే రాణించారు. ఇప్పుడు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ఆయిదుగురు ఆటగాళ్లే కీలకంగా మారనున్నారు. ఈ ఆయిదుగురు ఆటగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే టీమిండియాకు షాక్ తప్పదని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆ అయిదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం పదండీ....
ఆరోన్ జోన్స్:
టీ 20 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో అమెరికా బ్యాటర్ అరోన్ జోన్స్ 40 బంతుల్లో 94 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెనడాతో జరిగిన ఆ మ్యాచ్‌లో జోన్స్ 10 సిక్సర్లు కొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగల జోన్స్ ఒత్తిడిలో చాలా ప్రశాంతంగా ఆడగలడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ జోన్స్ 26 బంతుల్లో 36 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్‌తో జరిగిన సూపర్ ఓవర్‌లోనూ జోన్స్ 18 పరుగులకు 11 పరుగులు చేశాడు. ఆరోన్ జోన్స్... స్పిన్నర్లపై ఎదురుదాడి చేసి మంచి ఇన్నింగ్స్‌లు ఆడగలడు.
మోనాక్ పటేల్:
అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా ఆ జట్టులో కీలక ఆటగాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మోనాంక్ పటేల్ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ మోనాంక్ పటేల్ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో పటేల్ 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మోనాంక్ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే టీమిండియాకు తిప్పలు తప్పవు. మోనాంక్ అద్భుతమైన కీపర్ కూడా. అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో మోనాంక్ 12 స్టంపింగ్‌లు చేశాడు.
నోష్టుష్ కేంజిగే
నోష్టుగ్ అమెరికా జట్టులో కీలక స్పిన్నర్. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో నోష్టుగ్‌కు అవకాశం రాకపోయినా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు మిడిలార్డర్ వెన్ను విరిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూయార్క్ పిచ్ స్పిన్ బౌలర్లకు సహాయకరంగా ఉంటుందని ఐర్లాండ్ ఆటగాడు క్రెయిగ్ యంగ్ చూపించాడు. కాబట్టి భారత బ్యాట్స్‌మెన్ నోష్టుష్ కెంజిగేతో జాగ్రత్తగా ఉండాలి.
కోరీ ఆండర్సన్
కోరీ అండర్సన్ న్యూజిలాండ్ తరపున ఆడాడు. అండర్సన్ అనుభవం కచ్చితంగా అమెరికాకు ఉపయోగపడనుంది. అండర్సన్ టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్. తనదైన రోజున అతడు విధ్వంసం సృష్టించగలడు. బ్యాట్, బాల్‌తో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించగలడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అండర్సన్ పేరిట 634 పరుగులు, 16 వికెట్లు కూడా ఉన్నాయి.
సౌరభ్ నేత్రవాల్కర్
లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి బౌలింగ్‌తో రాణించాడు. మహ్మద్ రిజ్వాన్‌ను అవుట్ చేసిన సౌరభ్ నేత్రవాల్కర్.. ఇఫ్తికార్ అహ్మద్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. సౌరభ్ ప్రత్యేకత ఏమిటంటే మంచి స్వింగ్‌తో రాణించగలడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement