అన్వేషించండి

Shubman Gill: గిల్‌ సెంచరీ చేయకుండా అవుట్‌తో సారా షాక్‌, సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్‌

Shubman Gill: శ్రీలంకతో జరిగిన మ్యాచులో 92 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌ అవుటవ్వడంతో అభిమానుల తో పాటు సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి సారా టెండూల్కర్‌ కూడా నిరాశ చెందింది.

Shubman Gill: ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. లంకను 55 పరుగులకే కుప్పకూల్చి 302 పరుగుల భారీ తేడాతో విజయదుంధుబీ మోగించింది.  ఈ మ్యాచ్‌లో సెంచరీలు చేస్తారనుకున్న విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ త్రుటిల్లో శతకాలు సాధించలేక పోయారు. 92 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌ అవుటవ్వడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అభిమానులతో పాటు సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి సారా టెండూల్కర్‌ కూడా గిల్‌ అవుట్‌ అవ్వగానే బాగా నిరాశ చెందింది. గిల్‌ అవుటవ్వగానే సారా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.    
 టిమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ 92 పరుగులతో అద్భుతంగా ఆడుతున్న సమయంలో సెంచరీ చేయకుండానే అవుటయ్యాడుడు. దిల్షాన్ మధుశంక వేసిన స్లో బౌన్సర్‌ను సరిగ్గా అంచనా వేయలేక కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ నిరాశగా వెనుదిరిగాడు. అప్పటికే 11 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో గిల్‌ విధ్వంసం సృష్టించాడు. ఇక సెంచరీ ఖాయమనుకున్న దశలో గిల్‌ అవుటవ్వడం అభిమానులను నిరాశపరిచింది. శతకానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో గిల్ అవుట్వడంతో  లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఆమె.... గిల్‌ అవుటయ్యాక ఇచ్చిన రియాక్షన్‌  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


 భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా సారా టెండూల్కర్ హాజరైంది. పుణె వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌కు సారా తన స్నేహితులతో కలిసి వచ్చింది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు సిక్స్‌లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతన్ని అభినందించింది. గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది. శుభ్‌మన్‌ గిల్‌ ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడల్లా సారా  కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేసింది. హసన్ మహమూద్ బౌలింగ్‌లో గిల్ ఎడ్జ్ తీసుకున్న బాల్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది. ఈ ఫోర్ తర్వాత సారా టెండూల్కర్ ఫుల్ ఎగ్జైంట్‌గా పీలై గట్టిగా చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాను దున్నేసింది.


 సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావటంతో అప్పట్లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా సైతం హాజరవుతూ రావటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. మరోసారి సారా మ్యాచ్‌కు హాజరుకావడంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ వార్తల్లో నిలిచారు. ఈ రూమర్లకు సారా టెండూల్కర్ ప్రవర్తన బలం చేకూర్చుంది. శుభ్‌మన్ గిల్ అవుటైనప్పుడు సారా టెండూల్కర్ నిరాశకు గురవ్వడంతో మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో ఈ ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ మొదలైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. గతేడాది క్రితం వరకు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరిపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది. సారా టెండూల్కర్.. టీమిండియా మ్యాచ్‌కు హాజరవ్వడంతో మరోసారి ఈ ఇద్దరి ప్రేమయాణం వార్తల్లో నిలిచింది. గిల్‌ బౌండరీ కొట్టిన కెమెరామెన్‌ సారాను చూపించడంతో స్టాండ్లలో ఉన్న ఫ్యాన్స్‌ ఈలలు, కేరింతలతో ఊగిపోయారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget