IND VS SL 2ND ODI: రెండో వన్డేలో ఒక మార్పుతో బరిలోకి దిగిన భారత్!
IND VS SL 2ND ODI: భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మైదానం మొదట బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనక తెలిపాడు.
IND VS SL 2ND ODI: భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానం తొలుత బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనతోనే ముందు బ్యాటింగ్ చేయనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ దసున్ శనక తెలిపాడు. అలాగే ఇక్కడి రికార్డులు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్లకే అనుకూలంగా ఉన్నట్లు చెప్పాడు. తమ జట్టులో రెండు మార్పులు జరిగాయని వివరించాడు. మధుశంక, పాతుమ్ నిస్సాంక స్థానంలో నువానిడు ఫెర్నాండో, లాహిరు కుమార లు జట్టులోకి వచ్చారని తెలిపాడు.
'నేను రెండు ఆలోచనలతో ఉన్నాను. గతంలో మేం ఆడినదాన్ని బట్టి మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాను. అయితే ఇప్పుడు ఈ మైదానాన్ని చూసినప్పుడు బౌలింగ్ అయితే బావుండనుకున్నాను. గతం అనేది వదిలేసి ప్రస్తుతం మీద దృష్టిపెట్టాలి. గతం కన్నా ఇంకా మెరుగ్గా మారుతూనే ఉండాలి. నాకు ఈ మైదానంలో ఆడడం చాలా ఇష్టం. అలాగే ఇక్కడ అభిమానుల ఉత్సాహం నన్ను ఉత్తేజపరుస్తూ ఉంటుంది. మా జట్టులో ఒక మార్పు జరిగింది. గత మ్యాచ్ లో డైవ్ చేస్తూ చాహల్ గాయపడ్డాడు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక తుది జట్టు
కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, నువానీడు ఫెర్నాండో, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లాహిరు కుమార, కసున్ రజిత.
Sri Lanka have won the toss and elect to bat first in the 2nd ODI at Kolkata.
— BCCI (@BCCI) January 12, 2023
A look at our Playing XI for the game.
Live - https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/DKNDtd6rYT
Dasun Shanaka won the toss and elected to bat first.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 12, 2023
Nuwanidu Fernando makes his ODI debut!#INDvSL pic.twitter.com/lTV2SFgler
2ND ODI. Sri Lanka XI: A Fernando, K Mendis (wk), D D Silva, N Fernando, C Asalanka, D Shanaka (c), W Hasaranga, C Karunaratne, D Wellalage, K Rajitha, L Kumara. https://t.co/MY3Wc5253b #INDvSL @mastercardindia
— BCCI (@BCCI) January 12, 2023