IND vs NZ ODI: టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! కివీస్ సిరీసు నుంచి శ్రేయస్ అయ్యర్ ఔట్!
IND vs NZ ODI: న్యూజిలాండ్ సిరీసుకు ముందు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. మూడు వన్డేల సిరీసుకు పూర్తిగా దూరమయ్యాడు.
IND vs NZ ODI Series:
టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! న్యూజిలాండ్ సిరీసుకు ముందు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. మూడు వన్డేల సిరీసుకు పూర్తిగా దూరమయ్యాడు. వెన్నెముక గాయం వల్ల అతడిని తప్పించామని బీసీసీఐ తెలిపింది. అతనిప్పుడు బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్తున్నాడు. అక్కడ నిపుణుల సమక్షంలో రిహబిలిటేషన్ పొందుతాడు. అతడి స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినట్టు బోర్డు వెల్లడించింది.
UPDATE - Team India batter Shreyas Iyer has been ruled out of the upcoming 3-match ODI series against New Zealand due to a back injury.
— BCCI (@BCCI) January 17, 2023
Rajat Patidar has been named as his replacement.
More details here - https://t.co/87CTKpdFZ3 #INDvNZ pic.twitter.com/JPZ9dzNiB6
న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇప్పటికే కివీస్ భారత్‌లో అడుగుపెట్టింది. జనవరి 18న ఉప్పల్‌లో తొలి వన్డేలో తలపడనుంది. 21న రాయ్‌పుర్, 24న ఇండోర్‌లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి. 27, 29, ఫిబ్రవరి 1న టీ20 మ్యాచులు ఉంటాయి.
కొన్ని నెలలుగా శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్లు విఫలమైన ప్రతిసారీ రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో అతడి బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టులు, వన్డేల్లో విజృంభించాడు. తన షార్ట్‌పిచ్ బంతుల బలహీనత నుంచీ బయట పడుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవతరించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో అతడు ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతడు గాయపడటం జట్టుకు ఎదురుదెబ్బే !
న్యూజిలాండ్ వన్డే సిరీసుకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్య, రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ .
View this post on Instagram