IND vs NZ Final Match Live Updates : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టాస్ అప్‌డేట్- బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
IND vs NZ Final Match Live Updates : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ వేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs NZ Final Match Live Updates : దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన టాస్ వేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
టాస్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నారంటే...""ఆహ్... ఈ టోర్నమెంట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి, బౌలింగ్ కూడా చేసాం. ఇప్పుడు బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేయడంలో అభ్యంతరం లేదు."
"గత మ్యాచ్‌లో బాగా ఛేజ్ చేసాం. రోజు చివరిలో ఎంత బాగా ఆడతామనేదే ముఖ్యం. టాస్ గురించి పెద్దగా చింతించకూడదు. మేం మంచి క్రికెట్ ఆడాలి. న్యూజిలాండ్ ఇటీవలి కాలంలో మంచి క్రికెట్ ఆడుతోంది. వారు ఐసిసి టోర్నమెంట్లలో బాగా రాణిస్తున్నారు. గతం టీంతోనే బరిలోకి దిగుతున్నాం."
రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు చాలా దగ్గరగా వచ్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీకి చాలా కీలకమైంది.
భారత్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ లియర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి.
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (wk), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (c), నాథన్ స్మిత్, కైల్ జామిసన్, విలియం ఓ'రూర్కే.
రికార్డులను పరిశీలిస్తే, న్యూజిలాండ్‌పై టీం ఇండియా పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 119 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. భారతదేశం 61 మ్యాచ్‌ల్లో గెలిచింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పుడు భారత జట్టు ఇప్పుడు మరోసారి న్యూజిలాండ్‌తో తలపడుతోంది. గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. ఇప్పుడు దుబాయ్‌లో జరిగే ఫైనల్‌ను కూడా గెలవాలని చూస్తోంది. భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ బాగా రాణిస్తే టైటిల్‌ను కైవసం చేసుకోవచ్చు.
టీమిండియా విజయంలో బౌలింగ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు అద్భుతంగా రాణించారు. షమీ 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి కేవలం 2 మ్యాచ్‌ల్లోనే 7 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో కూడా షమీ, చక్రవర్తి అద్భుతాలు చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వీరితో పాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బౌలింగ్ లో అద్భుతంగా రాణించారు.
టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది -
భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి బలమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. రోహిత్, శుభ్‌మాన్ గిల్ టీం ఇండియా తరఫున మంచి ఓపినింగ్ అందిస్తున్నారు. ఈ జంట ఫెయిల్ అయినా తర్వాత వచ్చిన కోహ్లీ, అయ్యర్ పరిస్థితిని చక్కబెడుతున్నారు. దీని తర్వాత, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్‌లో తమ బలాన్ని చూపించగలుగుతున్నారు.
అద్భుతమైన కెప్టెన్సీతోపాటు అద్భుతమైన ఫీల్డింగ్..
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు నాలుగు ఐసిసి టోర్నమెంట్లలో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అతని కెప్టెన్సీలో భారతదేశం 2024 T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు వారు మరోసారి ఫైనల్స్‌కు చేరుకుంది. భారత విజయంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. అతనితోపాటు, జట్టు ఫీల్డింగ్ కూడా ముఖ్యమైనది.
Also Read : ఫైనల్ మ్యాచ్ కు పిచ్ సిద్ధం.. ఆ మ్యాచ్ కు వాడిన పిచ్ లో తుదిపోరు.. కామెంటేటర్ల జాబితా రెడీ




















