IND vs NZ 2nd ODI: చివరి 5 వన్డేల్లో ఓటమే! గబ్బర్ సేన కివీస్‌ను ఆపేదెలా?
IND vs NZ 2nd ODI Predicted XI: న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా రెడీ! హ్యామిల్టన్‌లో ఆదివారం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. గబ్బర్ సేన ఈ సిరీసులో నిలవాలంటే రెండో వన్డేలో కచ్చితంగా గెలవాలి.
India vs New Zealand 2nd odi preview:
న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా రెడీ! హ్యామిల్టన్ వేదికగా ఆదివారం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. గబ్బర్ సేన ఈ సిరీసులో నిలవాలంటే రెండో వన్డేలో కచ్చితంగా గెలవాలి. లేదంటే సిరీస్ కివీస్ వశం అవుతుంది. మరి ప్రత్యర్థి చేతిలో వరుస ఓటములకు భారత్ బదులిచ్చేనా?
బ్యాటింగ్ ఓకే!
బ్యాటింగ్ పరంగా టీమ్‌ఇండియాకు ఇబ్బందులేం లేవ్! శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ శుభారంభాలే ఇస్తున్నారు. నిలకడగా ఆడుతూ దూకుడు పెంచుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటున్నాడు. మొన్న దాదాపుగా సెంచరీకి చేరువయ్యాడు. సూర్యకుమార్ ఆట తెలిసిందే. ఇంటెంట్ మిస్సైందో ఇంకేదైనా ప్రాబ్లమో రిషభ్ పంత్ తన స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. అతడి నుంచి ఆశించేది ఒకటైతే ఔట్‌పుట్ మరోటి వస్తోంది. సంజూ శాంసన్ ఫినిషర్ రోల్‌కు ఫిక్సయ్యాడు. పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ తన దూకుడుతో అదరగొట్టాడు.
బౌలింగ్‌లో ఏదో తేడా!
వికెట్లు తీయడంలో టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతోంది. కొన్ని మ్యాచుల్లో బాగా రాణిస్తున్న బౌలర్లు కీలక సమరాల్లో చేతులెత్తేస్తున్నారు. జమ్మూ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు. తన వేగంతో రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ ఫర్వాలేదు. లెఫ్ట్ హ్యాండ్ సీమర్ కావడంతో జట్టులో ఉండటం కీలకం. కొన్నిసార్లు వికెట్లు తీయలేకపోతున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఆశించిన మేరకు రాణించలేదు. కివీస్ బ్యాటర్ టామ్ లేథమ్ అతడి బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. బహుశా రెండో వన్డేలో అతడి స్థానంలో దీపక్ చాహర్‌ను తీసుకోవచ్చు. సుందర్ ఫర్వాలేదు. యూజీ సైతం ఈ మధ్య ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు.
ఎవరో ఒకరు!
సొంత మైదానం కావడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఓపెనర్లు ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే ఫర్వాలేదు. డరైల్ మిచెల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94*) ప్రశాంతంగా తన పనికానిచ్చేశాడు. వికెట్ పడకుండా అడ్డుకున్నాడు. దాంతో టామ్ లేథమ్ (145*) దంచికొట్టి జట్టును గెలిపించేశాడు. కివీస్ మిడిలార్డర్లో వీరిద్దరే కీలకం. వీరిని ఔట్ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో! టిమ్ సౌథీ, ఫెర్గూసన్ పరుగుల్ని నియంత్రించడమే కాకుండా వికెట్లు పడగొడుతున్నారు. మ్యాట్ హెన్రీ, మిల్న్ సైతం ఫర్వాలేదు. శాంట్నర్ తన స్పిన్‌తో పరుగుల్ని నియంత్రిస్తున్నాడు.
నో బెటర్‌మెంట్!
న్యూజిలాండ్ గడ్డపై టీమ్‌ఇండియా మెరుగైన రికార్డేమీ లేదు. 2019లో తొలిసారి భారత్ ఇక్కడ సిరీస్ గెలిచింది. అయితే 2020లో ఓటమి పాలైంది. చివరి ఆరు వన్డేల్లో ఒకటి వాష్ ఔట్ అవ్వగా మిగిలిన ఐదింట్లో కివీస్‌దే విజయం. ఈ వరుస పరాజయాలతో చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
View this post on Instagram