IND vs NZ 2nd ODI: కివీస్ ను వణికించిన భారత బౌలర్లు- 108 పరుగులకే ఆలౌట్
IND vs NZ 2nd ODI: కివీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టీమిండియా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటయ్యింది.
IND vs NZ 2nd ODI: రాయ్ పూర్ పిచ్ పై తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్ ఎలా స్పందిస్తుందో తెలియదు. అయితే బ్యాటింగ్ కు అనుకూలమన్న వార్తలు. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు రోహిత్ శర్మ. గత మ్యాచ్ లో విఫలమైనప్పటికీ న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ప్రమాదకరమైనదే. పైగా గత వన్డేలో తొలుత విజృంభించిన భారత బౌలర్లు మధ్యలో పట్టు వదిలేశారు. ఫలితం మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా పేసర్లు కివీస్ బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వికెట్ల వేటలో పోటీపడ్డ భారత బౌలర్లు కివీస్ ను చుట్టేశారు. తక్కువ స్కోరుకే ఆ జట్టును ఆలౌట్ చేశారు.
కివీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టీమిండియా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటయ్యింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3, వాషింగ్టన్ సుందర్ 2, హార్దిక్ పాండ్య 2 వికెట్లతో రాణించారు.
15 పరుగులకే 5 వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు వణికించారు. బౌలర్లందరూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి వికెట్లు తీశారు. బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ వికెట్ దక్కించుకున్నాడు. బౌలర్ల విజృంభణతో కివీస్ 15 ఓవర్లలోనే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్లోనే స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే ఫిన్ అలెన్ (0) ను బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ వికెట్ల వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత హెన్రీ నికోల్స్ (20 బంతుల్లో 2) ను సిరాజ్ ఔట్ చేశాడు. డారిల్ మిచెల్ (1) ను షమీ, డెవాన్ కాన్వే (7) ను పాండ్య ఔట్ చేశారు. అనంతరం 11వ ఓవర్లో కెప్టెన్ టామ్ లాథమ్ (1) శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
బ్రాస్ వెల్, ఫిలిప్స్ పోరాటం
తక్కువ స్కోరుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ను గత మ్యాచ్ లో సెంచరీ చేసిన మైఖెల్ బ్రాస్ వెల్ (22), గ్లెన్ ఫిలిప్స్ లు ఆదుకునే ప్రయత్నం చేశారు. అడపాదడపా బౌండరీలు కొడుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ వీరు స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 41 పరుగులు జోడించారు. బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని షమీ విడదీశాడు. ఒక చక్కని బంతితో కీపర్ క్యాచ్ ద్వారా ప్రమాదకర బ్రాస్ వెల్ ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఫిలిప్స్ (36), శాంట్నర్ (27) తో కలిసి మళ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ జంట ఏడో వికెట్ కు 47 పరుగులు జోడించింది. మిచెల్ శాంట్నర్ ను హార్దిక్ పాండ్య బౌల్డ్ చేయటంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఫిలిప్స్ ను వాషింగ్టన్ సుందర్ బుట్టలో వేశాడు. అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు.
భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3, వాషింగ్టన్ సుందర్ 2, హార్దిక్ పాండ్య 2 వికెట్లతో రాణించారు. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
.@Sundarwashi5 🤝 @surya_14kumar
— BCCI (@BCCI) January 21, 2023
New Zealand 9 down as Lockie Ferguson gets out.
Follow the match ▶️ https://t.co/tdhWDoSwrZ #TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/tQiYfWQan5
Chopped 🔛 @hardikpandya7 scalps his 2⃣nd wicket 👏 👏
— BCCI (@BCCI) January 21, 2023
New Zealand 7 down as Mitchell Santner departs.
Follow the match ▶️ https://t.co/tdhWDoSwrZ #TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/CI4l3SaPWt