By: ABP Desam | Updated at : 18 Jan 2023 05:07 PM (IST)
Edited By: nagavarapu
విరాట్ కోహ్లీ (source: twitter)
Kohli Reaction Viral: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్- న్యూజిలాండ్ తొలి వన్డే జరుగుతోంది. శుభ్ మన్ గిల్ శతకంతో రాణించటంతో ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. అయితే అంతకుముందు భారత ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔటైన తీరుకు మైదానం మొత్తం సైలెంట్ అయిపోయింది. కోహ్లీ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు గిల్, రోహిత్ లు తొలి వికెట్ కు 60 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రోహిత్ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే విరాట్ ఔటైన తీరు అతన్నే కాదు అభిమానులను ఆశ్చర్యపరిచింది. కివీస్ బౌలర్ మిచెల్ శాంట్నర్ సంధించిన బంతి కోహ్లీ స్టంప్స్ ను గిరాటేసింది. బాల్ లెంగ్త్ ను, స్పిన్ ను అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. అంతే బంతి స్టంప్స్ ను పడగొట్టింది. తను ఔటైన విధానాన్ని నమ్మలేని కోహ్లీ ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. అలాగే మైదానంలోని ప్రేక్షకులు సైలెంట్ అయిపోయారు. విరాట్ 10 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ శతకంతో ఆకట్టుకున్నాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28) రాణించారు. ప్రస్తుతం భారత్ 41 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
Bowled! Santner beats Kohli to silence the stadium #INDvNZ pic.twitter.com/T9rB2o1p0P
— Ritwik Ghosh (@gritwik98) January 18, 2023
IND vs NZ: రెండో టీ20 జరిగే లక్నో గ్రౌండ్ ఎలా ఉంది? - వర్షం పడుతుందా?
IND vs NZ: అక్షర్‌ను దాటేసిన సుందర్ - ఆ విషయంలో కొత్త రికార్డు!
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Washington Sundar Catch: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సుందర్ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు