News
News
X

IND Vs IRE Match Highlights: చెలరేగిన టీమిండియా బ్యాటర్లు - మొదటి టీ20లో ఐర్లాండ్‌పై విక్టరీ!

ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

FOLLOW US: 

అదరగొట్టిన హ్యారీ టెక్టర్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. పవర్‌ప్లే నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (4: 5 బంతుల్లో, ఒక ఫోర్), ఆండ్రూ బాల్‌బిర్నీ (0: 2 బంతుల్లో), వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ గ్యారెత్ డెలానీల (8: 9 బంతుల్లో, ఒక ఫోర్) వికెట్లను ఐర్లండ్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 22 పరుగులు మాత్రమే. స్టిర్లింగ్‌ను హార్దిక్ పాండ్యా, బిల్‌బిర్నీని భువనేశ్వర్, గ్యారెత్‌ను అవేష్ ఖాన్ అవుట్ చేశారు.

ఈ దశలో హ్యారీ టెక్టర్ (64 నాటౌట్: 33 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్లు ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. మరో ఎండ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లొర్కాన్ టక్కర్ (18: 16 బంతుల్లో, రెండు సిక్సర్లు) వికెట్ కాపాడినా అవసరమైనంత వేగంగా ఆడలేకపోయాడు. టక్కర్ కూడా వేగంగా ఆడితే ఐర్లాండ్ మరింత భారీ స్కోరు చేసేది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. చివర్లో జార్జ్ డాక్రెల్ (4 నాటౌట్: 7 బంతుల్లో) కూడా అవసరం అయినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో ఐర్లాండ్ 12 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.

ఎక్కడా జోరు తగ్గని భారత్
109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (26: 11 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), దీపక్ హుడా (47 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి వికెట్‌కు 2.4 ఓవర్లలోనే 30 పరుగులు జోడించిన అనంతరం ఇషాన్ అవుటయ్యాడు. ఆ తర్వాత బంతికే సూర్యకుమార్ యాదవ్ (0: 1 బంతి) కూడా అవుట్ కావడంతో భారత్ కొంచెం తడబడింది.

అయితే ఈ దశలో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (24: 12 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), దీపక్ హుడా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత హార్దిక్ అవుటయినా... దినేష్ కార్తీక్‌తో (5 నాటౌట్: 4 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి హుడా మ్యాచ్‌ను ముగించాడు.

Published at : 27 Jun 2022 01:27 AM (IST) Tags: Hardik Pandya India Ireland India vs ireland IND vs IRE IND Vs IRE 1st T20I IND Vs IRE Match Update IND Vs IRE Highlights IND Vs IRE Match Highlights

సంబంధిత కథనాలు

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన