Stuart Broad 35 Runs Over: బ్రాడ్‌కి బాక్స్ బద్దలు - ఒకే ఓవర్లో 35 పరుగులు - ఈసారి కొట్టింది ఎవరో తెలుసా?
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించాడు.
స్టువర్ట్ బ్రాడ్‌కు టీమిండియా మరోసారి పీడకల మిగిల్చింది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ఒకే ఓవర్లో ఒక బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగులు ఇవే. ఇప్పుడు టెస్టుల్లో జస్‌ప్రీత్ బుమ్రా బ్రాడ్‌ను బాదేశాడు. ఐదో టెస్టులో బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో బుమ్రా ఏకంగా 35 పరుగులు రాబట్టాడు.
ఈ ఓవర్లో బ్రాడ్ వేసిన మొదటి బంతిని బుమ్రా ఫోర్ కొట్టాడు. రెండో బంతిని బ్రాడ్ వైడ్ వేయగా... కీపర్ ఆపలేకపోయాడు. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో రెండో బంతిని బ్రాడ్ మళ్లీ వేయాల్సి వచ్చింది. ఈసారి బ్రాడ్ నోబాల్ వేయగా దాన్ని బుమ్రా సిక్స్ కొట్టేశాడు. అంటే మొదటి బంతికే 16 పరుగులు వచ్చాయన్న మాట.
రెండు, మూడు, నాలుగు బంతులను బౌండరీలుగా మార్చిన బుమ్రా, ఐదో బంతిని మళ్లీ సిక్సర్ కొట్టాడు. అక్కడికి ఈ ఓవర్లో 34 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడంతో ఈ ఓవర్లో 35 పరుగులు వచ్చాయి. టెస్టుల్లో ఒక ఓవర్లో 30కి పైగా పరుగులు రావడం ఇదే మొదటిసారి.
టెస్టుల్లో ఒక ఓవర్లో వచ్చిన అత్యధిక పరుగులు ఇవే. రెండో స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన రాబిన్ పీటర్సన్ (28 పరుగులు - 2013లో వెస్టిండీస్‌పై) ఉండగా... మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్‌కే చెందిన జేమ్స్ అండర్సన్ (28 పరుగులు - 2013లో ఆస్ట్రేలియాపై), జో రూట్ (28 పరుగులు - 2020లో దక్షిణాఫ్రికాపై) ఉన్నారు.
View this post on Instagram