News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

IND vs ENG 1st T20: అసలే బట్లర్‌ ఆపై కెప్టెన్‌ అయ్యాడు! హిట్‌మ్యాన్‌ ఆపగలడా?

IND vs ENG 1st T20: భారత్‌, ఇంగ్లాండ్‌ గురువారం తొలి టీ20 ఆడుతున్నాయి. ప్రత్యర్థిని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న కసి టీమ్‌ఇండియాలో కనిపిస్తోంది. మరి నేటి మ్యాచులో గెలిచేదెవరు?

FOLLOW US: 
Share:

IND vs ENG 1st T20 Preview: సుదీర్ఘ ఫార్మాట్‌ను 2-2తో ముగిసించిన భారత్‌, ఇంగ్లాండ్‌ ఇప్పుడు పొట్టి క్రికెట్‌ సమరానికి (IND vs ENG T20 Series) సిద్ధమయ్యాయి. మూడు టీ20ల సిరీసులో భాగంగా గురువారం తొలి పోరులో తలపడుతున్నాయి. సౌథాంప్టన్‌లోని ఏజెస్‌ బౌల్‌ ఇందుకు వేదిక. తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన ఉత్సాహంలో ఆంగ్లేయులు ఉన్నారు. ప్రత్యర్థిని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న కసి టీమ్‌ఇండియాలో కనిపిస్తోంది. మరి నేటి మ్యాచులో గెలిచేదెవరు? తుది జట్లలో ఎవరుంటారు? పిచ్‌ పరిస్థితి ఏంటి?

హిట్‌ మ్యాన్‌ వచ్చేశాడు!

ఐదో టెస్టులో ఆడిన ఆటగాళ్లెవ్వరూ తొలి టీ20కి అందుబాటులో ఉండటం లేదు. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన కుర్రాళ్లే ఈ పోరులో తలపడనున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కొవిడ్‌ నుంచి కోలుకొని జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇన్నాళ్లూ మ్యాచ్‌ టైమ్‌ మిస్సవ్వడంతో పరుగులు చేయాలన్న కసితో ఉన్నాడు. ఇషాన్‌ కిషన్‌ అతడితో పాటు ఓపెనింగ్‌ చేయనున్నాడు. ఐపీఎల్‌ 2022కు ముందు నుంచీ దీపక్‌ హుడా (Deepak Hooda) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐర్లాండ్‌ సిరీసులో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ బాదేశాడు. ఈ మ్యాచులో అతడికి చోటు గ్యారంటీ!

సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) సైతం సత్తా చాటుకోవాలని తపన పడుతున్నాడు. మ్యాచ్‌ ఫినిషర్‌ అవతారం ఎత్తిన దినేశ్‌ కార్తీక్‌పై (Dinesh Karthik) అంచనాలు పెరిగాయి. హార్దిక్‌ పాండ్య అతడికి తోడుగా ఉన్నాడు. భువీ తన స్వింగ్‌తో ఇబ్బంది పెట్టగలడు. హర్షల్‌ పటేల్‌ పేస్‌ వేరియేషన్స్‌లో నిపుణుడు. అర్షదీప్‌, ఉమ్రాన్‌లో ఎవరికి చోటు దక్కుతుందన్నదే ఆసక్తికరం. అక్షర్‌, యూజీ స్పిన్‌ చూసుకుంటారు. ఈ మ్యాచు కోచింగ్‌  బాధ్యతలు వీవీఎస్‌ లక్ష్మణ్‌ భుజాలపైనే ఉన్నాయి.

బట్లర్‌ బాదుడుకు ఎదురేది?

విధ్వంసకరమైన దూకుడుకు ఇంగ్లాండ్‌ మరోపేరుగా మారింది! ఇయాన్‌ మోర్గాన్‌ రిటైర్మెంట్‌తో జోస్‌ బట్లర్‌ (Josh Buttler) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. టీమ్‌ఇండియా క్రికెటర్ల బ్యాటింగ్‌, బౌలింగ్‌పై అతడికి అవగాహన ఉంది. కొత్త కోచ్‌ మాథ్యూ మాట్‌ అతడికి అండగా ఉంటాడు. జేసన్‌ రాయ్‌, డేవిడ్‌ మలాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ వంటి డిస్ట్రక్టివ్‌ బ్యాటర్లు ఆతిథ్య జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలబడ్డా పరుగుల వరద తప్పదు! గాయంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరమైన యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరణ్‌ తిరిగి ఫామ్‌ నిరూపించుకున్నాడు. యూజీని ఎదుర్కొనేందుకు అతడిని ఫ్లోటర్‌గా ఉపయోగించొచ్చు. ఆదిల్‌ రషీద్‌ స్థానంలో మ్యాట్‌ పార్కిన్‌సన్‌ వచ్చాడు. 34 ఏళ్ల రిచర్డ్‌ గ్లీసన్‌ యార్కర్లు సంధించగలడు. రీస్‌ టాప్లే, తైమల్‌ మిల్స్‌, జోర్డాన్‌, కరన్‌ పేస్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌  ఆఫ్‌ స్పిన్‌ వేస్తారు.

పిచ్‌ ఎలా ఉందంటే?

సౌథాంప్టన్‌ పిచ్‌పై (Southampton) కొద్దికొద్దిగా పచ్చిక ఉంది. దేశంలోనే అతిపెద్ద బౌండరీలున్న మైదానం ఇది. సాధారణంగా తక్కువ స్కోర్లే నమోదు అవుతుంటాయి. టీ20 బ్లాస్ట్‌లో అతి తక్కువగా ఓవర్‌కు 7.93 పరుగులే వచ్చాయి. తొలి ఇన్సింగ్స్‌ సగటు స్కోరు 165. ఏడు మ్యాచుల్లో ఐదు సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే ఇక్కడ గెలిచాయి. వర్షం సూచనలేమీ లేవు.

India vs England 1st T20 match Probable XI

ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలాన్, మొయిన్‌ అలీ, లియామ్‌ లివింగ్‌స్టన్‌, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరణ్‌, క్రిస్‌ జోర్డాన్‌, తైమల్‌ మిల్స్‌, రీస్‌ టాప్లే, మ్యాట్‌ పార్కిన్‌సన్‌

భారత్‌: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్య, దినేశ్ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/అర్షదీప్‌ సింగ్‌India vs England, Ind vs Eng, ind vs eng highlights, IND vs ENG 1st T20, Rohit Sharma, Jos Buttler, Suryakumar Yadav, ishan kishan, liam livingstone, hardik pandya, Southampton,  భారత్‌, ఇంగ్లాండ్‌, టీ20 సిరీస్‌, రోహిత్‌ శర్మ, జోస్‌ బట్లర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, హార్దిక్ పాండ్య

Published at : 07 Jul 2022 01:47 PM (IST) Tags: Rohit Sharma Hardik Pandya India vs England IND vs ENG Suryakumar Yadav Ishan kishan Jos Buttler Liam Livingstone ind vs eng highlights IND vs ENG 1st T20 Southampton

ఇవి కూడా చూడండి

IND Vs AUS, Match Highlights: భారత్‌ ఖాతాలో మరో విజయం , పర్యటనను ఓటమితో ముగించిన ఆసిస్‌

IND Vs AUS, Match Highlights: భారత్‌ ఖాతాలో మరో విజయం , పర్యటనను ఓటమితో ముగించిన ఆసిస్‌

IND Vs AUS, Innings Highlights: ఆసీస్ లక్ష్యం 160, ఆడతారా? ఓడతారా ?

IND Vs AUS, Innings Highlights: ఆసీస్ లక్ష్యం 160, ఆడతారా? ఓడతారా ?

IND Vs AUS 5th T20: నేడే నామమాత్రపు మ్యాచ్‌, మార్పులతో బరిలోకి భారత్‌

IND Vs AUS 5th T20: నేడే నామమాత్రపు మ్యాచ్‌, మార్పులతో బరిలోకి భారత్‌

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×