అన్వేషించండి

మ్యాచ్‌లు

Watch Video: కోహ్లీ ఎప్పుడూ ఇంతే- ఇషాన్ డబుల్ సెంచరీ తర్వాత విరాట్ ఏం చేశాడో తెలుసా!

Watch Video: భారత్- బంగ్లా మధ్య జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాక విరాట్ కోహ్లీ చేసిన పని వైరల్ అవుతోంది. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా!

Watch Video:  విరాట్ కోహ్లీ... సహచరులను ప్రోత్సహించడంలో, వారి విజయాలను తాను సెలబ్రేట్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. తన తోటి ఆటగాడు సెంచరీ బాదినా అది తనే చేసినట్లు సంతోషపడిపోతాడు. వారికన్నా ముందే తను సంబరాలు చేసుకుంటాడు. ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్ - భారత్ మూడో వన్డేలో జరిగింది. ఇషాన్ కిషన్ ద్విశతకం సాధించాక అతనికన్నా ముందే విరాట్ సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు భాంగ్రా డ్యాన్స్ స్టెప్పులతో ఇషాన్ ను అభినందించాడు. 

నిన్న జరిగిన బంగ్లా- భారత్ మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ముందు ఆచితూచి ఆడిన అతను.. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో అలరించాడు. బంగ్లా బౌలర్లను నిస్సహాయులను చేస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగవంతమైన ద్విశతకం (131 బంతుల్లో 210 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు. అంతేకాదు ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్సుల్లో, అతి పిన్న వయసులో, అతి తక్కువ బంతుల్లో, ఒక్క సెంచరీ కూడా చేయకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఇషాన్ పలు మైలురాళ్లను అందుకున్నాడు.

ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత తన 71వ శతకాన్ని అందుకున్నాడు. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరాడు. సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. 

 

విరాట్ భాంగ్రా డ్యాన్స్

అయితే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ అందుకున్నాక కోహ్లీ చేసిన పని వైరల్ అయ్యింది. 199 పరుగుల వద్ద ఉన్నప్పుడు ముస్తాఫిజర్ బౌలింగ్ లో సింగిల్ తీసి ఇషాన్ తన ద్విశతకాన్ని అందుకున్నాడు. ఇయితే ఇషాన్ కన్నా ముందే కోహ్లీ బ్యాట్ పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. అలాగే భాంగ్రా స్టెప్పులు వేస్తూ ఇషాన్ ను అభినందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఇంతే. తన సహచరుల విజయాలను వారికంటే ఎక్కువగా ఆస్వాదిస్తాడు. అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
Embed widget