By: ABP Desam | Updated at : 09 Dec 2022 01:26 PM (IST)
Edited By: nagavarapu
కుల్దీప్ యాదవ్ (source: twitter)
IND vs BAN 3rd ODI: భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ రేపు జరగనుంది. ఈ సిరీస్ ను బంగ్లా 2-0తో గెలుచుకుంది. ఆఖరి మ్యాచ్ నామమాత్రమే. అయితే ఇందులో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. అందుకే తుది జట్టు కూర్పులో మార్పులు చేస్తోంది. బంగ్లాతో మూడో వన్డేకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. అతను తుది జట్టులోనూ ఉండే అవకాశముంది. ఇప్పటికే రోహిత్ శర్మ, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ లు గాయాలతో తప్పుకున్నారు.
భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు జట్టులో సభ్యుడు. ఇప్పుడు మూడో వన్డేలోనూ జట్టులోకి తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు మ్యాచ్‌కి ముందు జరిగే చివరి వన్డేలో కుల్‌దీప్‌కు తుది జట్టులో ఆడే అవకాశం వస్తే.. అది అతనికి టెస్టుల్లో రాణించేందుకు ఉపయోగపడుతుంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో కుల్దీప్ కు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడెలా రాణిస్తాడో చూడాలి.
🚨 NEWS 🚨: Kuldeep Yadav added to #TeamIndia squad for the final ODI against Bangladesh. #BANvIND
Other Updates & More Details 🔽https://t.co/8gl4hcWqt7 — BCCI (@BCCI) December 9, 2022
చివరి వన్డే
డిసెంబర్ 10, భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు భారత్- బంగ్లా మూడో వన్డే ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ సోనీ నెట్‌వర్క్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డీడీ స్పోర్ట్స్ లోనూ లైవ్ చూడొచ్చు.
బంగ్లాతో చివరి వన్డేకు టీమిండియా జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.
2023లో టీమిండియా బిజీ బిజీ- 3 నెలల్లో 3 దేశాలతో సిరీస్ లు
వచ్చే సంవత్సరం (2023) టీమిండియా బిజీగా గడపనుంది. విరామం లేకుండా వరుసబెట్టి స్వదేశంలో సిరీస్ లు ఆడనుంది. జనవరి నుంచి మార్చి వరకు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో మ్యాచులు ఆడనుంది. మూడు నెలల్లో 4 టెస్టులు, 9 వన్డేలు, 6 టీ20లు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. జనవరిలో శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేలతో హోమ్ సీజన్ ప్రారంభం కానుంది.
Rahul Tripathi and Ishan Kishan in the nets, who should open in the 3rd ODI? Kuldeep Yadav and Shahbaz bowling to Ishan, Rahul taking throw downs.#BANvsIND #INDvsBangladesh pic.twitter.com/Prp1roDYwN
— CRICKET KA YARAANA (@A__A__MALIK) December 9, 2022
IND vs AUS Test: అహ్మదాబాద్ లో భారత్- ఆస్ట్రేలియా ఆఖరి టెస్ట్- వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు!
Women's T20 World Cup 2023 Schedule: ఫిబ్రవరి 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్- 12న చిరకాల ప్రత్యర్థితో భారత్ ఢీ
Hardik Pandya: నిర్ణయాలు నావే, ఫలితానికి బాధ్యతా నాదే: హార్దిక్ పాండ్య
WPL Auction 2023: ఫిబ్రవరి 13న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం!
IND vs NZ 3rd T20: శుభ్‌మన్ గిల్ సెంచరీ నుంచి న్యూజిలాండ్ పతనం వరకు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన మీమర్స్!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు