అన్వేషించండి

IND Vs BAN: మూడోది మనదే - క్లీన్‌స్వీప్ గండం తప్పించుకున్న భారత్!

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 227 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్‌కు ఊరట విజయం లభించింది. మూడో వన్డేలో 227 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 182 పరుగులకే కుప్పకూలింది. మొదటి రెండు వన్డేల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది.

410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత బౌలర్లు మొదటి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచారు. బంగ్లా బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్థ సెంచరీ చేయలేకపోయారు. షకీబ్ అల్ హసనే (43: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్. బౌలింగ్ వేసిన ప్రతి భారత బౌలర్‌కు వికెట్ దక్కింది. శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

టాస్ ఓడిన భారత్ మొదట  ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే అవుట్ కావడంతో భారత్ 15 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

ఇక ఇషాన్‌ కిషన్‌ అయితే బంగ్లాదేశ్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం 126 బంతుల్లోనే 200 స్కోరును ఇషాన్ అందుకున్నాడు. రోహిత్‌ శర్మ, సచిన్ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సరసన చేరాడు. అయితే డబుల్ సెంచరీ అయిన కొద్ది సేపటికే ఇషాన్ కిషన్ అవుటయ్యాడు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడటంతో ఇషాన్‌ కిషన్‌కు తుది జట్టులో చోటు దొరికింది. ఝార్ఖండ్‌ డైనమైట్‌ ఈ అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నాడు. ఆత్మవిశ్వాసం పెరిగాక ఇషాన్‌ కిషన్‌ ఇంకా రెచ్చిపోయాడు. షకిబ్‌, ఇబాదత్‌, తస్కిన్‌ సహా బౌలర్లందరికీ ఊచకోతను పరిచయం చేశాడు. కేవలం 85 బంతుల్లోనే కెరీర్లో తొలి సెంచరీ అందుకున్నాడు. అప్పటికీ తన ఆకలి తీరలేదు. గాయపడ్డ సింహం మాదిరిగా బ్యాటుతో గాండ్రించాడు. 16 బౌండరీలు, 8 సిక్సర్లతో 103 బంతుల్లోనే 150 మైలురాయికి చేరుకున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అండతో వడివడిగా డబుల్‌ సెంచరీ వైపు అడుగులేశాడు. ముస్తాఫిజుర్‌ వేసిన 34.6వ బంతికి సింగిల్‌ తీసి ఎలైట్‌ కబ్ల్‌లో అడుగుపెట్టాడు. 126 బంతుల్లోనే ద్విశతకం అందుకున్నాడు. యంగెస్ట్‌, ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచూరియన్‌గా రికార్డు సృష్టించాడు.

మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఇషాన్‌కు చక్కటి సహకారం అందించాడు. ఇదే క్రమంలో విరాట్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 190 బంతుల్లోనే 290 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ఇషాన్ కిషన్ అవుటయ్యాక వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రాణించలేకపోయారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో స్కోరు 400 మార్కును దాటింది. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget