IND vs BAN 1st Test: తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌటైన బంగ్లా- 5 వికెట్లతో చెలరేగిన కుల్దీప్
భారత్- బంగ్లాదేశ్ మధ్య చట్టోగ్రామ్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 8 వికెట్లకు 133 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా 150 పరుగులకు ఆలౌటైంది.
IND vs BAN 1st Test: భారత్- బంగ్లాదేశ్ మధ్య చట్టోగ్రామ్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 8 వికెట్లకు 133 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా 150 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ అహ్మద్ నాటౌట్ గా నిలిచాడు. ఆ 2 వికెట్లను కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు తీశారు. 28 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం బంగ్లా ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్.
మొదటి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసిన టీమిండియా ప్రస్తుతం 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో కుల్దీప్ 5 వికెట్లతో రాణించాడు. మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. బంగ్లాకు టీమిండియా ఫాలో ఆన్ ఇవ్వలేదు.
💬💬 @mdsirajofficial speaks about his bowling approach after scalping 3️⃣ wickets on Day 2 of the first #BANvIND Test 👍🏻👍🏻#TeamIndia pic.twitter.com/k5gtmWuGR1
— BCCI (@BCCI) December 15, 2022
రాణించిన భారత బౌలర్లు
మొదట తొలి ఇన్నింగ్సులో టీమిండియా 404 పరుగులు చేసింది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (84), అశ్విన్ (58), కుల్దీప్ (40) పరుగులతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను భారత బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులేసి బంగ్లా టైగర్స్‌ను వణికించారు. పరుగుల ఖాతా తెరవకముందే నజ్ముల్ హుస్సేన్ (0)ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ జాకీర్ హుస్సేన్ (20)నూ అతడే పెవిలియన్ పంపించాడు. మరికాసేపటికే లిటన్ దాస్ (24)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. మధ్యలో ఉమేశ్ యాదవ్.. యాసిర్ అలీ (4)ని ఔట్ చేశాడు. అతడి తర్వాత కుల్‌దీప్ యాదవ్ చెలరేగాడు. అతడు వేగంగా వేయడం లేదన్న కంప్లైంట్ ఉండేది. విచిత్రంగా ఈసారి కీపర్ రిషభ్ పంత్ అతడిని నెమ్మదిగా బంతులేయమని ప్రోత్సహించాడు. పిచ్, కండిషన్స్‌ను ఉపయోగించుకున్న మణికట్టు స్పిన్నర్ ముష్ఫికర్ రహీమ్ (28), షకిబ్ అల్ హసన్ (3), నురుల్ హసన్ (16), తైజుల్ ఇస్లామ్ (16)ను పెవిలియన్ పంపించాడు. దాంతో 44 ఓవర్లకు బంగ్లా 133/8తో నిలిచింది.
Innings Break!
— BCCI (@BCCI) December 16, 2022
Bangladesh all out for 150.@imkuldeep18 shines with the ball with a brilliant fifer 👌👌#TeamIndia lead by 254 runs.
Scorecard - https://t.co/GUHODOYOh9 #BANvIND pic.twitter.com/KUjWrGnmys
A stunning all round display from the left arm spinner as @imkuldeep18 registers his third 5-wicket haul in Test cricket.
— BCCI (@BCCI) December 16, 2022
Live - https://t.co/GUHODOYOh9 #BANvIND pic.twitter.com/gYdjRI4ISG