IND vs AUS Test: అహ్మదాబాద్ లో భారత్- ఆస్ట్రేలియా ఆఖరి టెస్ట్- వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు!
IND vs AUS Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు అహ్మదాబాద్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం.
IND vs AUS Test: ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియా- భారత్ మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్ కు చేరుకుంది. 4 టెస్టుల ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ను భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బనీస్ లు మైదానానికి వచ్చి వీక్షించనున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ మైదానంలో భారత్- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. మార్చి 9 నుంచి 13 వరకు ఈ టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఆటను వీరిద్దరూ కలిసి చూడనున్నట్లు సమాచారం.
భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ భారత్, ఆస్ట్రేలియా ఇరు జట్లకు చాలా కీలకమైనది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు ఈ సిరీస్ ఇరు జట్లకు మంచి అవకాశం. కాబట్టి ఉత్కంఠభరిత పోరు ఖాయం. గత మూడుసార్లు జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. కాబట్టి ఆస్ట్రేలియన్లు ఈసారి మరింత పట్టుదలగా ఆడతారనడంలో సందేహంలేదు.
ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత పర్యటన ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. టీమిండియా తర్వాతి 3 టెస్టు మ్యాచ్‌లు ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌లలో జరగనున్నాయి.
ఎవరిది పైచేయి?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లను వారి సొంత మైదానంలోనే ఏకపక్షంగా ఓడించింది. అదే సమయంలో ఉపఖండంలో ఈ జట్టు పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గత ఏడాది భారత జట్టు టెస్టు గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టెస్టుల్లో ఓడిన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లపై మాత్రమే విజయం సాధించగలిగింది.
సొంతగడ్డపై ఆడడం భారత్ బలం
అయితే సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కూడా అంత తేలికైన విషయం కాదు. గత 18 ఏళ్లలో ఆస్ట్రేలియా జట్టు ఒక్కసారి కూడా భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలను కూడా భారత జట్టే గెలుచుకుంది. టీమిండియా కూడా బలంగానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి సిరీస్‌లో ఎవరిది పైచేయి అని చెప్పడం కష్టం.
Time for another round of Border-Gavaskar trophy 🔥#India #INDvsAUS #Cricket #Tests pic.twitter.com/WLv0DDr0Ti
— Wisden India (@WisdenIndia) January 26, 2023
At the age 26, Virat Kohli smashing peak Johnson all over the park.@imVkohli 🔥#ViratKohli | #BorderGavaskarTrophy | #INDvsAUS | #INDvAUS pic.twitter.com/u9C5LQxfG6
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 2, 2023