News
News
X

IND vs AUS: రోహిత్, కోహ్లీపై ప్రెషర్ - ఆ ముగ్గురిపై నజర్

IND vs AUS: ఫిబ్రవరి 9న నాగ్ పుర్ లో తొలి టెస్టుతో ఈ ట్రోఫీ స్టార్ట్ అవబోతోంది. ఈ సిరీస్ లో భారత్ నుంచి ఈ ఐదుగురు ఆటగాళ్లపై ప్రధానంగా దృష్టి నెలకొంటుంది. వాళ్లు ఎలా పర్ఫార్మ్ చేస్తారో దగ్గరుండి గమనిస్తారు.

FOLLOW US: 
Share:

IND vs AUS: రోజురోజుకూ హైప్ పెరిగిపోతోంది. క్షణక్షణానికీ ఎగ్జైట్ మెంట్ ఎక్కువైపోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. అంత ఎగ్జైట్ మెంట్ ఏంటి కేవలం టెస్టు మ్యాచులే కదా అని సింపుల్ గా తీసిపారేసే వారికి తెలియదు... టెస్టుల్లో బ్యూటీ ఏంటో.... ఈ బీజీటీ ఈసారి ఇరుజట్లకు ఎంత కీలకమో. ఫిబ్రవరి 9న నాగ్ పుర్ లో తొలి టెస్టుతో ఈ ట్రోఫీ స్టార్ట్ అవబోతోంది. ఈ సిరీస్ లో భారత్ నుంచి ఈ ఐదుగురు ఆటగాళ్లపై ప్రధానంగా దృష్టి నెలకొంటుంది. వాళ్లు ఎలా పర్ఫార్మ్ చేస్తారో దగ్గరుండి గమనిస్తారు. ఇందులో కొందరిపై పాజిటివ్ ప్రెషర్ అయితే, మరికొంతమందిపై కాస్త నెగెటివ్ ప్రెషర్ అనే చెప్పుకోవాలి. ఆ అయిదుగురు ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

1. రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఫిబ్రవరి 2022 లో టీమ్ పగ్గాలు అందుకున్నాడు. కానీ ఎప్పుడూ అసలు టీమిండియా ఫుల్ టైం కెప్టెన్ అన్న ఫీలింగ్ చాలా మందికి రాలేదు. ఎందుకంటే వన్డేలు, టీ20ల్లో ఎప్పటికప్పుడు విశ్రాంతి. అతి కీలకమైన టెస్ట్ ఫార్మాట్ కు వచ్చేసరికి.... టీమిండియా గతేడాది ఆడింది... కేవలం 7 టెస్టులే. అందులోనూ రోహిత్ గాయాల వల్ల 5 టెస్టులకు మిస్. కేవలం శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ లో జట్టును నడిపించాడు. సుమారు ఏడాది అయిపోతోంది.... రోహిత్ రెడ్ బాల్ క్రికెట్ ఆడి. అతని లాంగ్ ఫార్మాట్ ఫాం ఎలా ఉండబోతోందో కూడా ఈ సిరీస్ లో చూడాల్సిన అంశం. ఆఖరి సెంచరీ 2021 సెప్టెంబర్ లో కొట్టాడు. దాని తర్వాత ఆడినది కేవలం 3 ఇన్నింగ్స్ మాత్రమే. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే.... టెస్టుల్లో ఇప్పటిదాకా రోహిత్ కు సరైన సవాల్ ఎదురవలేదు. గతేడాది ఇంగ్లండ్ లో జరిగిన అతి కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్సీ చేసేవాడే. కానీ కొవిడ్ వచ్చింది. దూరమయ్యాడు. ఇప్పుడు నాలుగు మ్యాచుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రోహిత్ కెప్టెన్సీకి అసలైన పరీక్ష. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉంది. దానికి జట్టు క్వాలిఫై అయ్యేలా నడిపించాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ డిఫెండ్ చేసుకోవాలి. ఈ మధ్యే కివీస్ పై వన్డేల్లో సెంచరీ కొట్టాడు. ఆ ఫాం టెస్టుల్లోనూ చూపించాలి. ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న ఇండియన్ టెస్ట్ టీంను స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. మరీ ముఖ్యంగా.... ఆన్ ఫీల్డ్ లో ఈ సిరీస్ లో భారీగా స్లెడ్జింగ్, కవ్వింపులు జరిగే అవకాశాలు ఎక్కువ. వాటిని ఎలా ఎదుర్కొంటాడు, తన ప్లేయర్స్ ను ఎలా నడిపిస్తాడో చూడాలి. 

ఇక ఈ సిరీస్ లో మనం కన్నేయాల్సిన రెండో ఇండియన్ ప్లేయర్.

2. విరాట్ కోహ్లీ

గత మూడున్నరేళ్లలో క్రికెట్ ప్రపంచంలో ఎక్కువ మాట్లాడుకున్న టాపిక్... కోహ్లీ. సెంచరీలు. కానీ అన్నింటి కరవు తీర్చేస్తూ వస్తున్నాడు. ఏషియా కప్ లో అఫ్గానిస్థాన్ పై సెంచరీ మొదలు.... వన్డేల్లో పెద్ద గ్యాప్ లేకుండానే 3 సెంచరీలు కొట్టేశాడు. కింగ్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. కానీ టెస్టుల్లో ఫాం ఇంకా కలవరపెడుతోంది. ఎప్పుడో 2019 చివర్లో బంగ్లాదేశ్ పై ఆఖరి టెస్టు సెంచరీ. సెంచరీల సంగతి పక్కన పెట్టండి. 2020లో యావరేజ్ 19, 2021లో 28, 2022 లో 27.... కోహ్లీ స్థాయి లాంటి బ్యాటర్ కే కాదు... అసలు ఏ బ్యాటర్ కు అయినా సరే ఇది యాక్సెప్ట్ చేయలేని రికార్డ్. కచ్చితంగా ఈ నంబర్స్ ను ఈ సిరీస్ ద్వారా కోహ్లీ మెరుగుపర్చుకోవాలి. ఈ మధ్యే ఫాంలోకి వచ్చేశాడు కదా.... టెస్టుల్లో కూడా దాన్ని రెప్లికేట్ చేయాలని ఫ్యాన్స్, టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కానీ కోహ్లీకి ఊరటనిచ్చే విషయం ఏంటో తెలుసా...? ఎదురుగా ఉన్నది తన ఫేవరెట్ అపోజిషన్ ఆసీస్. ఆడుతోంది తన ఫేవరెట్ ఫార్మాట్... టెస్టులు. ఇప్పటిదాకా ఆసీస్ పై కోహ్లీ 7 సెంచరీలు సాధించాడు. ఏ దేశంపై అయినా సరే ఇదే అత్యధికం. చూద్దాం రెడ్ బాల్ ఫార్మాట్ లో కోహ్లీ తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటాడో లేదో. 

3. రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా... ఇతను ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడు... ఈ ప్రశ్న అడిగితే కాస్త ఆలోచించాల్సిందే. ఏషియా కప్ నుంచి అంటే సుమారు 6 నెలల నుంచి మాత్రమే ఆటకు దూరమైనా సరే... ఆఖరి మ్యాచ్ ఆడి ఎన్నో ఏళ్లు అయిపోయినట్టు అనిపిస్తోంది. అంతకముందు దాకా ఫాం పరంగా జడేజా నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ మోకాలి సర్జరీ తర్వాత మొట్టమొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. అది కూడా స్ట్రైట్ గా టెస్ట్ మ్యాచ్. అఫ్ కోర్స్ ఈ మధ్య రంజీ మ్యాచ్ ఆడి ఫాం, ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. కానీ దాన్ని ఇంతటి పెద్ద స్టేజ్ మీద ఎలా రెప్లికేట్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే బౌలింగ్ లో జడేజా ఎంత ఇంపార్టెంటో స్పెషల్ గా చెప్పక్కర్లేదు కానీ... ఇప్పుడు బ్యాటింగ్ లో అంతే ముఖ్యంగా మారాడు. రిషబ్ పంత్ లేని భారత బ్యాటింగ్ లైనప్ లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కూడా లేడు. ఆరు లేడా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే జడ్డూ.... ఆసీస్ స్టార్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ ను ఎలా కౌంటర్ చేస్తాడనే విషయం మీదే మ్యాచ్ ఫలితాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. 

4. మహ్మద్ సిరాజ్

సిరాజ్... ఈ హైదరాబాదీ కుర్రాడు ఇప్పుడు నంబర్ వన్ వన్డే బౌలర్. 2022 మొత్తం... అదరగొట్టాడు. బుమ్రా గాయం లేదా విశ్రాంతి వల్ల దూరమవటంతో వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ ప్లాన్స్ లో ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్. కానీ టెస్టులు విషయానికి వచ్చేసరికి ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. 15 టెస్టుల్లో 46 వికెట్లు తీశాడు. కాస్త యావరేజ్ పర్ఫార్మెన్స్ . కానీ ఇప్పుడున్న ఫాం ప్రకారం... తన స్కిల్స్ ను రెడ్ బాల్ తోనూ ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు. జట్టులో ఉమేష్ ,షమి, ఉనాద్కత్, సిరాజ్ మన పేసర్లు. తుదిజట్టులో మాత్రం ఇద్దరే చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. సీనియర్స్ అయినా సరే.... ఫాం, స్కిల్ ను బట్టి షమి, సిరాజ్ కు చోటు దక్కొచ్చు. టెస్టుల్లో వర్క్ హార్స్ లా బౌలింగ్ చేసే ఆటగాడు ప్రతి జట్టుకూ కావాలి. మరీ ముఖ్యంగా.... ఒక్కసారి కుదురుకున్న తర్వాత పరుగుల వరద పారే అవకాశమున్న ఇండియన్ పిచెస్ లో మరింతగా అలాంటి ఆటగాడి అవసరం ఉంటుంది. సరిగ్గా ఆ రోల్ ను భర్తీ చేయగలవాడే సిరాజ్. బుమ్రా లేని లోటును వన్డేల్లో ఎలా తెలియనివ్వలేదో... ఇప్పుడు టెస్టుల్లోనూ దాన్ని రిపీట్ చేసే అవకాశముంది. 

ఇక ఈ సిరీస్ లో మనం కన్నేయాల్సిన ఆఖరి ఇండియన్ ప్లేయర్. మన తెలుగు కుర్రాడు

5. కేఎస్ భరత్

సుమారు ఏడాదిన్నరగా టీమిండియాతోనే ట్రావెల్ చేస్తున్నాడు... కేఎస్ భరత్. ఎప్పట్నుంచైతే సాహాను టీమిండియా పక్కన పెట్టిందో... పంత్ కు బ్యాకప్ గా భరత్ టీంతోనే ఉన్నాడు. కానీ ఇప్పటిదాకా డెబ్యూ చేయలేదు. కానీ ఇప్పుడు పంత్ దూరమవటంతో ఆ స్థానం దాదాపుగా భరత్ కు దక్కినట్టే. ఎందుకంటే... కేఎల్ రాహుల్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లిమిటెడ్ ఓవర్స్ లో వికెట్ కీపింగ్ అనుభవమున్నా సరే... రాహుల్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కాదు. పైగా రీసెంట్ గా ఇంజూరీ నుంచి కోలుకున్నాడు. అలాంటప్పుడు రాహుల్ ను టెస్టుల్లో కీపర్ చేయకపోవచ్చు. ఇషాన్ కిషన్, భరత్ మాత్రమే జట్టులో ఉన్నారు. ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటే ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న భరతే ఈ సిరీస్ లో అన్ని మ్యాచెస్ ఆడటం దాదాపుగా పక్కా. బ్యాటింగ్ లో కాస్త దిగువన ఆడతాడు కాబట్టి... ఆల్ రౌండర్లను, టెయిలెండర్లను మేనేజ్ చేసుకుంటూ భరత్ తన స్కిల్ చూపించాలి. అదే సమయంలో స్పిన్నింగ్ ట్రాక్స్ మీద అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటివారి బౌలింగ్ లో వీలైనంత అలర్ట్ గా ఉంటూ అద్భుతమైన వికెట్ కీపింగ్ ప్రదర్శించాలి. అలా చేస్తే పంత్ వచ్చేదాకా టెస్టు జట్టులో ఢోకా ఉండదు.

సో రోహిత్, కోహ్లీ, జడేజా, సిరాజ్, భరత్.... ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కన్నేయాల్సిన ఐదుగురు ప్లేయర్స్ వీళ్లే అని మా అంచనా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Published at : 06 Feb 2023 05:31 PM (IST) Tags: Ravindra Jadeja KS Bharat Ind vs Aus Mohammad siraj ROHIT SHARMA VIRAT KOHLI

సంబంధిత కథనాలు

Asia Cup: మోడీ గారూ, టీమిండియాను పాకిస్థాన్ పంపించండి అని అడుగుతా : అఫ్రిది

Asia Cup: మోడీ గారూ, టీమిండియాను పాకిస్థాన్ పంపించండి అని అడుగుతా : అఫ్రిది

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!

MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!

MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్‌.. హరికేన్‌ ఇన్నింగ్స్‌ - ఆఖరి లీగులో గుజరాత్‌కు తప్పని ఓటమి!

UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్‌.. హరికేన్‌ ఇన్నింగ్స్‌ - ఆఖరి లీగులో గుజరాత్‌కు తప్పని ఓటమి!

టాప్ స్టోరీస్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics :

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం