IND vs AUS: నేటి నుంచి భారత్ ఆసీస్ మధ్య నాలుగో టెస్ట్- లోపాలు సరిచేసుకునేలా ఇరు జట్ల ప్రణాళికలు
IND vs AUS: ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత జట్టు మార్పులతో బరిలోకి దిగనుంది. మూడో టెస్టులో టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
IND vs AUS: ఈ ఒక్క మ్యాచ్ ఈ ఒక్క మ్యాచ్ గెలిచేస్తే చాలు...వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ కు టీమిండియా రైట్ రాయల్ గా వెళ్లిపోతుంది. అందుకే ఆస్ట్రేలియా ఇండియాల మధ్య ఈ రోజు నుంచి మొదలవుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇంత క్రూషియల్ గా మారింది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యం సంపాదించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలుపుకున్న భారత్..మూడో టెస్ట్ ఓటమికి మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని కచ్చితంగా భావిస్తోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కూడా వస్తుండటంతో ఈ మ్యాచ్ ఇంకాస్త ప్రెస్టేజీయస్ గా మారింది. మరి రోహిత్ ఆర్మీ ఏం చేస్తుంది...పిచ్, టీం సెలక్షన్ పరిస్థితి ఎలా ఉండనుంది చూద్దాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మూడో టెస్టులో టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే సిరీస్‌లో టీమిండియా 1-2తో ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మదాబాద్‌లో జరగాల్సిన చివరి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే, ఈ సిరీస్ గెలవాలంటే టీమ్ఇండియా చివరి మ్యాచ్లో తప్పక గెలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో టెస్టుకు ముందు టీమ్ఇండియా ఏ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో ఆనే ఆసక్తి నెలకొంది.
టీమ్ సెలక్షన్ కంటే ముందు పిచ్ గురించి మాట్లాడాలి ఎందుకంటే మూడో టెస్ట్ లో చూశాం స్పిచ్ పిచ్ తయారు చేయించి ఆ స్పిన్ ఉచ్చులో మనోళ్లే పడిపోయారు. సో మొతేరా పిచ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడంతా ఆసక్తి. బీసీసీఐ కూడా ఆఖరి నిమిషం వరకూ క్యూరేటర్లకు పిచ్ కు సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదంట. పిచ్ ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఫస్ట్ రోజే టర్న్ అయితే లభించకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మూడు టెస్టులు చూశాం. కనీసం మూడురోజులు కూడా ఆడలేదు. సో ఈ సారి కొంచెం ఐదు రోజుల మ్యాచ్ జరిగేలానే క్యూరేటర్ పిచ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డే బై డే పిచ్ మీద స్క్రాచెస్ వస్తాయి కాబట్టి స్పిన్నర్లకు అడ్వాంటేజ్ కావచ్చు. కానీ ఫస్ట్ డే మాత్రం బ్యాట్స్మన్ కు అనుకూలంగా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తోంది..స్టీవ్ స్మిత్ కూడా అదే మాట చెప్పాడు.
ఇక టీమిండియా విషయానికి వస్తే..ముందుగా బ్యాటింగ్. ఈ సిరీస్ లో ఇదిరా మన బ్యాటింగ్ డెప్త్ అనేది కనిపించలేదు. ఇప్పటివరకు రోహిత్, పుజారా మాత్రమే హాఫ్ సెంచరీలు కొట్టిన స్పెషలిస్ట్ బ్యాటర్లు. సో ఈ మ్యాచ్ లో రోహిత్, పుజారాలతో పాటు కోహ్లి కూడా ఆడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.ఈ సిరీస్ లో రోహిత్ శర్మ చేసిన మొత్తం పరుగులు (207)..అతనే లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నది అక్షర్ పటేల్ అదీ 185 పరుగులతో అంటే అర్థం చేసుకోవచ్చు బ్యాటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో రన్స్ కోసం. హోప్ రోహిత్, పుజారా, కొహ్లీ నిలబడితే...అంతా సెట్ అయిపోతుంది. రాహుల్ తో శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడు.ఇక లోయర్ ఆర్డర్‌లో ఎప్పట్లానే జడేజా,అశ్విన్, అక్షర్ పటేల్ అండగా నిలబడతారని టీమిండియా ఆశిస్తోంది.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇండోర్ టెస్టులో ఆడకపోయినా అహ్మదాబాద్ టెస్టులో ఈ ఫాస్ట్ బౌలర్ పునరాగమనం దాదాపు ఖాయమైంది. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టులో మహ్మద్ షమీ పునరాగమనం చేస్తే మహ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే భారత వెటరన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షమీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించడం కూడా జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది.
షమీతోపాటు ఇషాన్ కిషన్ రూపంలో టీమ్ఇండియాలో మరో కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిజానికి భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా కిషన్ కు అవకాశం దక్కవచ్చు. కేఎస్ భరత్ స్థానంలో కిషన్ జట్టులోకి రావచ్చు. వాస్తవానికి కేఎస్ భరత్ ఇప్పటివరకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో అహ్మదాబాద్లో జరిగే చివరి టెస్టులో అతడిని తప్పించే అవకాశం ఉంది.
భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది?
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా విషయానికి వస్తే రెండు టెస్టులు ఓడిపోయినా...మూడో టెస్టులో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ లో అద్భుతంగా కమ్ బ్యాక్ ఇచ్చింది. బేసిక్స్ కట్టుబడి ఆడారు కాబట్టే మూడో టెస్టులో అద్భుతమైన రిజల్ట్ ను కంగారూ టీమ్ ఎంజాయ్ చేసింది. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్లలో ఉంటుంది. నాలుగో టెస్టులో దాన్ని కంటిన్యూ చేసేందుకు పక్కాగా ట్రై చేస్తారు. ఖవాజా ఓపెనింగ్ వాళ్లకు చాలా అడ్వాంటేజ్.ఫామ్ ను కంటిన్యూ చేయాలని ఖవాజా కోరుకుంటాడు. అలాగే థర్డ్ టెస్ట్ లో చూశాం.. లబుషేన్, స్టీవ్ స్మిత్, హ్యాండ్స్ కాంబ్ వీళ్లంతా కూడా వాళ్ల శక్తిమేర క్రీజులో నిలబడటానికి ట్రే చేశారు. కానీ లోయర్ ఆర్డర్ వీళ్లకు ఆందోళన కలిగిస్తోంది. టాప్ ఆర్డర్ వికెట్లు పడిపోతే మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పేకమేడలా కూలిపోయారు. బౌలింగ్ కూడా చాలా బ్యాలెన్సింగ్ ఉంది. ఇద్దరు యంగ్ స్పిన్నర్లకు తోడుగా సీనియర్ నాథన్ లయన్..పేస్, అండ్ స్పిన్న్ విభాగాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు ఆస్ట్రేలియా.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది?
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), హ్యాండ్స్కాంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), కుహ్నెమన్, లియోన్, స్టార్క్, మర్ఫీ