By: ABP Desam | Updated at : 11 Mar 2023 02:55 PM (IST)
Shubman Gill (Image source- BCCI twitter)
IND vs AUS 4h Test: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (197 బంతుల్లో 103 నాటౌట్, 10x4, 1x6) తాను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యద్భుత ఫామ్ లో ఉన్న ఈ పంజాబీ కుర్రాడు... తాజాగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా శతకం బాదాడు. టెస్టులలో అతడికి ఇది రెండో శతకం కాగా స్వదేశంలో మొదటిది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన ఛటేశ్వర్ పుజారా (121 బంతులలో 42, ) కూడా రాణించాడు. కానీ టీ సమయానికి ఒక్క ఓవర్ కు ముందు భారత్ కు మర్ఫీ షాకిచ్చాడు. టీ విరామానికి భారత్.. 63 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గిల్ తో పాటు విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు.
గిల్ జిగేల్..
ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వన్డేలు, టీ20లలో సెంచరీలతో చెలరేగిన గిల్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా రెచ్చిపోయాడు. తొలి రెండు టెస్టులలో అతడికి అవకాశం రాకున్నా నిరాశపడకుండా టీమ్ లో చోటు కోసం ఎదురుచూసిన గిల్.. బంతి బాగా తిరిగిన ఇండోర్ పిచ్ లో మిగతా బ్యాటర్ల మాదిరిగానే తాను కూడా విఫలమయ్యాడు. కానీ అహ్మదాబాద్ లో మాత్రం కంగారూలను కంగారెత్తిస్తున్నాడు. లంచ్‌కు ముందే హాఫ్ సెంచరీ సాధించిన గిల్.. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అర్థ సెంచరీ తర్వాత గిల్ 80లలోకి వచ్చేవరకూ ఆచితూచి ఆడాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా సహనం కోల్పోకుండా నిలబడ్డాడు. ఇక 80లలోకి వచ్చాక కామెరూన్ గ్రీన్ వేసిన 56 వ ఓవర్లో రెండు బౌండరీలు బాది 90 లలోకి వచ్చాడు. అదే ఊపులో మర్ఫీ వేసిన 61 వ ఓవర్లో రెండో బంతిని ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. 194 బంతుల్లో అతడి సెంచరీ పూర్తయింది.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
రోహిత్ నిష్క్రమణ తర్వాత పుజారాతో కలిసి శతాధిక భాగస్వామ్యం (113 పరుగులు) జోడించిన పుజారా టీ విరామానికి ముందు ఔటయ్యాడు. మర్ఫీ వేసిన 62 వ ఓవర్లో చివరి బంతి పూజారా ప్యాడ్స్ కు తాకింది. అంపైర్ అవుటిచ్చినా పుజారా రివ్యూకు వెళ్లాడు. కానీ రివ్యూలో అతడికి వ్యతిరేక ఫలితం వచ్చింది. దీంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు.
భారీ స్కోరుపై కన్ను..
పుజారా నిష్క్రమించిన అనంతరం క్రీజులోకి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వచ్చాడు. కోహ్లీ - గిల్ ల జోడీ ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నది. దీనికి న్యూజిలాండ్ తో వన్డే సిరీసే సజీవ సాక్ష్యం. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై కోహ్లీ నిలదొక్కుకుంటే ఆస్ట్రేలియా చేసిన 480 పరుగులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. నేడు మరో సెషన్ ఆటలో భారత్ వికెట్లేమీ కోల్పోకుంటే 300 మార్కు చేరుకునే అవకాశాలున్నాయి.
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!
Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా