By: ABP Desam | Updated at : 23 Sep 2023 10:31 PM (IST)
మిషెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్
India vs Australia 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని ఆస్ట్రేలియా, ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
మొహాలీ వన్డేలో భారత జట్టు కంగారూలను ఐదు వికెట్ల తేడాతో ఓడించినప్పటికీ, ఆస్ట్రేలియాలో కొందరు ఆటగాళ్లు సింగిల్ హ్యాండ్‌తో జట్టును గెలిపించే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇండోర్‌లో ఆస్ట్రేలియా జట్టును ఒంటరిగా నడిపించగల ముగ్గురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
1. మిచెల్ మార్ష్
విధ్వంసకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన మిచెల్ మార్ష్, మొహాలీ వన్డేలో కేవలం ఒక ఫోర్ మాత్రమే కొట్టి ఔటయ్యాడు. అయితే అతను మ్యాచ్ గమనాన్ని మార్చగలడని అందరికీ తెలిసిందే. మార్ష్ ప్రస్తుతం ఓపెనింగ్ చేసి మొదటి బంతి నుంచే బౌండరీలు కొట్టడం ప్రారంభించాడు. మార్ష్ తొలి 10 ఓవర్లు ఆడితే మ్యాచ్ భవితవ్యాన్ని మార్చేయగలడు.
2. డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మొహాలీలో జరిగిన వన్డేలోనూ వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు. వార్నర్ అనుభవం, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఇండోర్‌లో ఆస్ట్రేలియా జట్టును ఒంటిచేత్తో గెలిపించగలడని చెప్పడంలో తప్పులేదు.
3. మార్కస్ స్టోయినిస్
మార్కస్ స్టోయినిస్ లోయర్ ఆర్డర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తో అద్భుతాలు చేయగలడు. మొహాలీలో జరిగిన తొలి వన్డేలో స్టోయినిస్ వేగంగా 29 పరుగులు సాధించాడు. చివరి వరకు నిలదొక్కుకుని ఉంటే స్కోరును సులువుగా 300 పరుగులకు చేర్చేవాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ద్వారా కూడా జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలవగలడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ పొడిగింపు
Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్ గన్
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత
Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Elections Exit Polls : గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?
Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?
/body>