IND vs AUS, 1st Test: తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్- భరత్, సూర్యకుమార్ అరంగేట్రం
IND vs AUS, 1st Test: భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ప్రారంభం అయ్యింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
IND vs AUS, 1st Test: భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ప్రారంభం అయ్యింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మంచి పిచ్ లా కనిపిస్తోంది. ఈ సిరీస్ ను ప్రారంభించడానికి మేం ఇంకా వెయిట్ చేయలేం. దీనికోసం మా సన్నాహకం బాగా జరిగింది. మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. టాడ్ మర్ఫీ టీంలోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్ స్థానంలో హ్యాండ్స్ కాంబ్ వచ్చాడు.' అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు.
కేఎస్ భరత్, సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం
'టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. పిచ్ పొడిగా కనిపిస్తుంది. స్పిన్నర్లకు సహాయం ఉంటుంది. అయితే ఇది ఎంత వరకు ఉంటుందో వేచి చూడాలి. నిన్న మేము ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు పేసర్లకు కొంత సీమ్ లభించింది. మేము గత 5-6 రోజులుగా మంచి ప్రాక్టీస్ చేశాము. ఈ సిరీస్ యొక్క ప్రాముఖ్యత మాకు తెలుసు. అయితే ప్రస్తుతం మేం ఒక సెషన్ గెలవడం గురించి ఆలోచించాలి. ఇది సుదీర్ఘ సిరీస్. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. కేఎస్ భరత్, సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ అరంగేట్రం చేస్తున్నారు.' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (డెబ్యూ), శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
🚨 Team News 🚨
— BCCI (@BCCI) February 9, 2023
Test debuts for @surya_14kumar & @KonaBharat for #TeamIndia 👌 👌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #INDvAUS | @mastercardindia
A look at our Playing XI 🔽 pic.twitter.com/div9awCB4o
ఆస్ట్రేలియా తుది జట్టు
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్.
పిచ్ ఎలా ఉందంటే..
అందరూ ఊహిస్తున్నట్లే పిచ్ స్పిన్‌కు అనుకూలించనుంది. రెండు జట్ల స్పిన్నర్లు మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనున్నారు. పిచ్ పై పగుళ్లను చూస్తుంటే తొలి రోజు నుంచే స్పిన్నర్లకు సహకరించేలా కనిపిస్తోంది.
హెడ్ టూ హెడ్
స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య 14 టెస్ట్ సిరీస్ లు జరిగితే భారత్ 8 సిరీస్ విజయాలు సాధించింది. ఆసీస్ 4 సిరీసులు గెలిచింది. మరో 2 డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాతో ఆడిన 102 టెస్టుల్లో భారత్ 30 విజయాలు సాధించింది. 43 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మరో మ్యాచ్ టైగా ముగిసింది.
🚨 Toss Update 🚨
— BCCI (@BCCI) February 9, 2023
Australia have elected to bat against #TeamIndia in the 1⃣st #INDvAUS Test in Nagpur.
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx @mastercardindia pic.twitter.com/6ZnOd6MsCO




















