By: ABP Desam | Updated at : 09 Feb 2023 03:15 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రవీంద్ర జడేజా ( Image Source : BCCI )
IND vs AUS, 1st Test:
నాగ్‌పుర్ టెస్టులో టీమ్‌ఇండియా దుమ్మురేపింది! పర్యాటక ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. తొలి ఇన్నింగ్సులో ప్రత్యర్థిని 177 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇందుకోసం కేవలం 63.5 ఓవర్లే తీసుకుంది. భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్ అశ్విన్ (3/42) దెబ్బకు కంగారూలు వణికిపోయారు. టర్నయ్యే బంతుల్ని ఆడలేక బ్యాట్లెత్తేశారు. మార్నస్ లబుషేన్ (49; 12౩ బంతుల్లో 8x4), స్టీవ్‌స్మిత్ (37; 107 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్లు.
That's a 5-wicket haul for @imjadeja 💥🫡🔥
— BCCI (@BCCI) February 9, 2023
His 11th in Test cricket.
Live - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/Iva1GIljzt
స్మిత్, లబుషేన్ పోరాటం కాసేపే!
స్పిన్ పిచ్ కావడంతో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎండకాస్తే పిచ్ విపరీతంగా టర్న్ అవుతుందని, రెండోరోజు టీమ్‌ఇండియాకు కష్టమవుతుందని అనుకుంది. కానీ తొలిరోజే వారు గింగిరాలు తిరిగే బంతులకు వికెట్లు పారేసుకున్నారు. రెండు పరుగుల వద్దే ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1) పెవిలియన్‌కు చేరుకున్నారు. షమి వేసిన బంతికి వార్నర్ సెంటర్ వికెట్టు ఎగిరి అవతలపడింది. ఖవాజాను సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ సిచ్యువేషన్లో స్మిత్, లబుషేన్ నిలకడగా ఆడారు. 76/2తో లంచ్‌కు వెళ్లారు. మూడో వికెట్‌కు 202 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
A brilliant session for #TeamIndia 💪💪
— BCCI (@BCCI) February 9, 2023
Four wickets for @imjadeja & two wickets for @ashwinravi99 in the afternoon session as Australia are 174/8 at Tea on Day 1 of the 1st Test.
Scorecard - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/MWJLQV6qUC
జడ్డూ.. రాక్‌స్టార్!
భోజన విరామం తర్వాతే అసలు కథ మొదలైంది. జట్టు స్కోరు 84 వద్ద జడ్డూ బౌలింగ్‌లో లబుషేన్ స్టంపౌట్ అయ్యాడు. అరంగేట్రం ఆటగాడు, ఆంధ్రా కీపర్ కేఎస్ భరత్ అతడిని ఔట్ చేశాడు. అదే స్కోరు వద్ద స్మిత్‌నూ జడ్డూనే ఔట్ చేశాడు. మ్యాట్ రెన్షా (0)ను డకౌట్ చేశాడు. కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (31; 84 బంతుల్లో 4x4), అలెక్స్ కేరీ (36; 33 బంతుల్లో 7x4) ఆదుకొన్నారు. ఆరో వికెట్‌కు 68 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. కీలకంగా మారిన ఈ జోడీని కేరీని ఔట్ చేయడం ద్వారా యాష్ విడదీశాడు. అప్పటికి స్కోరు 162. మరో పది పరుగులకే హ్యాండ్స్‌కాంబ్‌ను జడ్డూ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కంగారూలు ఔటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.
Innings Break!
— BCCI (@BCCI) February 9, 2023
Brilliant effort from #TeamIndia bowlers as Australia are all out for 177 in the first innings.
An excellent comeback by @imjadeja as he picks up a fifer 👏👏
Scorecard - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/RPOign3ZEq
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) February 9, 2023
4⃣5⃣0⃣ Test wickets & going strong 🙌 🙌
Congratulations to @ashwinravi99 as he becomes only the second #TeamIndia cricketer after Anil Kumble to scalp 4⃣5⃣0⃣ or more Test wickets 👏 👏
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #INDvAUS pic.twitter.com/vwXa5Mil9W
ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!