Australia vs India 1st ODI: తొలి వన్డేలో టాస్ నెగ్గిన ఆసీస్.. ఫస్ట్ బ్యాటింగ్ భారత్‌దే, నితీష్ రెడ్డి అరంగేట్రం
india vs australia 1st ODI | పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. నితీష్ రెడ్డి ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేస్తున్నాడు.

IND vs AUS 1st ODI | భారత వన్డే క్రికెట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ తొలిసారిగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. దాంతో భారత క్రికెట్లో రోకో ద్వయం తరువాత కొత్త శకం ప్రారంభం కానుంది. 26 ఏళ్ల భార ఓపెనర్ గిల్ మూడు మ్యాచ్‌ల IND vs AUS ODI సిరీస్ నుంచి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు, పెర్త్‌లో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు గిల్ కెప్టెన్సీలో ఆడనున్నారు. మరోవైపు, ఆస్ట్రేలియా కూడా పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో మిచెల్ మార్ష్ జట్టుకు నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. నితీష్ రెడ్డికి ఇది స్పెషల్ మూమెంట్ ఇది.
భారత్ జట్టు 11: 1 రోహిత్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), 3 విరాట్ కోహ్లీ, 4 శ్రేయాస్ అయ్యర్, 5 కేఎల్ రావుల్ (వికెట్ కీపర్), 6 అక్సర్ పటేల్, 7 వాషింగ్‌టన్ సుందర్, 8 నితిష్ రెడ్డి, 9 హర్షిత్ రానా, 10 అర్ష్‌దీప్ సింగ్, 11 మహ్మద్ సిరాజ్
1st ODI INDIA XI: S. Gill (c), R. Sharma, V. Kohli, S. Iyer, KL. Rahul (wk), A. Patel, N. K. Reddy, W. Sundar, H. Rana, A. Singh, M. Siraj https://t.co/O1RsjJTHhM #TeamIndia #AUSvIND #1stODI
— BCCI (@BCCI) October 19, 2025
ఆస్ట్రేలియా టీమ్: 1 ట్రావిస్ హెడ్, 2 మిచెల్ మార్ష్ (కెప్టెన్), 3 మ్యాట్ షార్ట్, 4 జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), 5 మ్యాట్ రెన్షా, 6 మిచ్ ఓవెన్, 7 కూపర్ కానొల్లీ, 8 మిచెల్ స్టార్క్, 9 నాథన్ ఎలిస్, 10 మ్యాట్ క్యూనెమన్, 11 జోష్ హజెల్ వుడ్
పెర్త్ స్టేడియం పిచ్, వాతావరణ నివేదిక
పెర్త్ పేస్‌కు అనుకూలమైన పిచ్. ఇది ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా చెబుతారు. కానీ ఆకాశం మేఘావృతమై ఉండటంతో తేలికపాటి వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటువంటి పరిస్థితులు సీమర్లకు పేస్ తో పాటు స్వింగ్ కు అనుకూలిస్తాయి. బౌన్స్ రాబట్టి బ్యాటర్లను బౌలర్లు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ పిచ్ ఎప్పటికీ బ్యాటర్లకు ఒక సవాలుగా మారుతుంది.
మ్యాచ్ ప్రివ్యూ.. అంచనా
రెండు జట్లు మార్పులకు గురవుతున్నాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాకు సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ వారు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమ్మిన్స్ మరియు ఆడమ్ జంపా వంటి కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతోంది.
బలహీనమైన మిడిల్ ఆర్డర్, తక్కువ అనుభవం కలిగిన బౌలింగ్ అటాక్ ఆతిథ్య జట్టు ఆసీస్ ను బలహీనపరిచే అవకాశం ఉంది. మరోవైపు, భారత్ మరింత సమతుల్యమైన లైనప్‌ను కలిగి ఉంది. కీలక ఆటగాళ్లు తిరిగి రావడంతో, గిల్ నాయకత్వంలో వారు బరిలోకి దిగుతున్నారు కనుక భారత్ కొంచెం పైచేయి సాధించవచ్చు.





















