By: ABP Desam | Updated at : 16 Mar 2022 09:18 AM (IST)
ఇంగ్లాండ్‌కు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ (Photo Credit: Twitter/@BCCIWomen)
ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబాటుకు లోనైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ సేనకు ఇంగ్లాండ్ జట్టు వరుస షాక్‌లు ఇచ్చింది. ఏ ఒక్క బ్యాటర్‌ను క్రీజులో కుదుకోనివ్వలేదు. ఓపెనర్ స్మృతి మంధాన (35) కాస్త పరవాలేదనిపించింది. భారత జట్టు 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఇంగ్లాండ్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మిథాలీ సేన నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో చార్లీ డీన్ 4 వికెట్లు తీయగా, అన్య ష్రూబ్‌సోలే 2 వికెట్లు పడగొట్టింది.
ఓపెనింగ్ నుంచి తడబ్యాటు..
గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు బరిలోకి దిగింది. మొదట టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. యస్తికా భాటికా, స్మృతి మంధాన భారత ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. కానీ 18 పరుగులకే ఓపెనర్ యస్తికా భాటికా (8)ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించింది బౌలర్ ష్రూబ్‌సోలే. ఆపై జట్టు స్కోరు 25 పరుగుల వద్ద కెప్టెన్ మిథాలీ రాజ్ ఔట్ కావడం భారత్ కు బిగ్ షాకిచ్చింది. 10 బంతులాడిన దీప్తి శర్మ ఖాతా తెరవకుండానే డకౌట్ అయింది. అది కూడా రనౌట్ రూపంలో దీప్తి శర్మ(0) పెవిలియన్ బాట పట్టింది.
ఒకే ఓవర్లో డబుల్ షాక్..
ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డీన్ టీమిండియావకు ఒకే ఒవర్లో డబుల్ షాకిచ్చింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(14), స్నేహ్ రానా(0)లను పెవిలియన్ చేర్చింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రెండో బంతికి హర్మన్ ఔట్ కాగా, తాను ఎదుర్కొన్న రెండో బంతికే (అదే ఓవర్లో నాలుగో బంతికి) స్నేహ్ రానా ఔటై డకౌట్‌గా వెనుదిరిగింది. టాపార్డర్‌లో యస్తికా భాటియా, మిథాలీరాజ్, దీప్తి రానాలు విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది.
#TeamIndia are bowled out for 134.
A brilliant bowling and fielding display by #TeamEngland 👊
#CWC22 pic.twitter.com/Ssu10CzJhL — ICC (@ICC) March 16, 2022
ఆదుకున్న రిచా ఘోష్..
ఓవైపు వరుస వికెట్లు పడుతున్నా ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేసింది. కానీ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మంధానను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది ఇంగ్లాండ్ బౌలర్ ఎస్సెల్‌స్టోన్. మంధాన (35; 58 బంతుల్లో 4x4) ఔట్ కావడంతో భారత్ 100 పరుగులకే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ రిచా ఘోష్ భారత జట్టును ఆదుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. పూజా వస్త్రాకర్ 6 పరుగులకు ఔటయ్యాక.. సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామితో కలిసి రిచా ఘోష్ 8 వ వికెట్‌కు 37 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. స్కోరు పెంచే క్రమంలో అనవర పరుగుకు ప్రయత్నించి రిచా ఘోష్ (33; 56 బంతుల్లో 5x4) రనౌట్ అయి 8 వికెట్‌గా నిష్క్రమించింది. చివర్లో ఝులన్ గోస్వామి (20) పరవాలేదనిపించడంతో భారత్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 36.2 ఓవర్లో భారత్ 134 పరుగులకే కుప్పకూలడంతో ఇంగ్లాండ్ ముందు లక్ష్యాన్ని ఉంచింది.
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Horoscope Today 23 May 2022: ఈ రాశివారు గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి