ICC Test Rankings: యశస్వీ జోరు మాములుగా లేదుగా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏ స్థానమంటే ?
Yashasvi Jaiswal: టీమిండియా యువ సంచలనం, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న యశస్వీ జైస్వాల్... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టీమ్ఇండియా బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లు తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. తరువాత రబాడ, హేజిల్ వుడ్, పాట్ కమిన్స్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కివీస్‌తో మొదటి టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన నాథన్ లయోన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. జస్‌ప్రీత్ బుమ్రా 867 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 846 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కగిసో రబాడ మూడు.. హేజిల్‌వుడ్ నాలుగు... పాట్ కమిన్స్ అయిదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లోవిరవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, షకీబ్ అల్ హసన్, జో రూట్, అక్షర్ పటేల్, జేసన్ హోల్డర్, బెన్ స్టోక్స్‌లు టాప్-7లో కొనసాగుతున్నారు.
ఐసీసీ అవార్డు రేసులో జైస్వాల్
ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC Men's Player Of The Month) రేసులో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న జైస్వాల్.... ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవరి నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ సంబంధించిన నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్‌తో పాటు కివీస్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక లు చోటు సంపాదించారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలు పరిగణలోకి తీసుకుని వీరిని ఐసీసీ నామినేట్ చేసింది ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జైస్వాల్ 112 సగటుతో 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస మ్యాచుల్లో డబుల్ సెంచరీలు సైతం ఉన్నాయి. దక్షిణాప్రికా పై మూడు శతకాలతో కేన్ విలియమ్సన్ రికార్డు నెలకొల్పాడు . అఫ్గానిస్తాన్‌తో జరిగిన 3 వన్డేల్లో ఓ ద్విశతకం, మరో సెంచరీతో నిస్సంక 350 కి పైగా పరుగులు చేశాడు మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ లు ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా నిలిచారు.