T20 World Cup 2022: పాక్ బౌలర్ షహీన్‌కు షమీ టిప్స్ - వైరల్ అవుతున్న ఫొటో!
టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్‌లో పాకిస్తాన్ బౌలర్ షహీన్ అఫ్రిదికి భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ టిప్స్ అందించాడు.
ఎంతో అనుభవజ్ఞుడైన పేస్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలం పాటు భారత క్రికెట్‌కు సేవలందించాడు. టీ20 ప్రపంచకప్ కోసం జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో భారత జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ నెట్స్‌లో శ్రమించడం ప్రారంభించాడు. భారత్ ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడనుంది. పాక్ పేసర్ షహీన్ షా ఆఫ్రిదికి మహ్మద్ షమీ టిప్స్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతంది. ఈ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
మహ్మద్ షమీ మొదట్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో రిజర్వ్ సభ్యునిగా ఎంపికయ్యాడు. కానీ జస్‌ప్రీత్ బుమ్రాకు గాయం కావడంతో అతన్ని ప్రధాన ఆటగాళ్ల జాబితాలో చేర్చారు. తన అనుభవంతో మహ్మద్ షమీ... భువనేశ్వర్ కుమార్‌తో కలిసి టి20 ప్రపంచకప్‌లో భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తాడు.
ప్రస్తుతం భారత జట్టులోని యువ ఆటగాళ్లే కాకుండా షహీన్ షా అఫ్రిది వంటి పాకిస్తాన్ సీమర్లు కూడా మహ్మద్ షమీ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించిన ఈ ఫొటోలో, షహీన్‌కు కొన్ని చిట్కాలను ఇస్తున్న సమయంలో మహ్మద్ షమీ ఎడమచేతి వాటం బౌలర్‌గా మారిపోయాడు. రెండు జట్ల మధ్య శత్రుత్వం, కొన్ని రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌తోనే మ్యాచ్ వంటి అంశాలు ఉన్నప్పటికీ భారత పేసర్ షమీ పాకిస్తానీ బౌలర్ షహీన్ అఫ్రిదికి సహాయం చేయడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది.
టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో భారత్ తన మొదటి వార్మప్ గేమ్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది. మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు, అది కూడా ఆఖరి ఓవర్. ఆ ఓవర్‌లో షమీ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాస్తవానికి, మ్యాచ్ చివరి 4 బంతుల్లో ఆస్ట్రేలియా మొత్తం 4 వికెట్లు కోల్పోయింది, వాటిలో మూడు షమీ తీశాడు. అందులో ఒకటి రనౌట్ కావడంతో షమీ హ్యాట్రిక్ పూర్తి కాలేదు.
View this post on Instagram