అన్వేషించండి

IND vs PAK, T20 World Cup 2022: సలామ్‌ ఛేజ్‌ మాస్టర్‌! ఏందీ ప్రెజర్‌.. ఫైనలే గెలిచినట్టుంది - పాక్‌పై టీమ్‌ఇండియా ప్రతీకారం!

IND vs PAK, T20 World Cup 2022: ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ విరాట్‌ కోహ్లీ 130 కోట్ల మందిని మురిపించాడు. సూపర్‌ 12 మ్యాచులో పాక్ జట్టుపై టీమ్‌ఇండియాను గెలిపించాడు.

IND vs PAK, T20 World Cup 2022: ఆహా.. ఏమి థ్రిల్లర్‌ సామీ ఇది! ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచులోనూ ఇంత టెన్షన్‌ ఉండదేమో! అందుకేనేమో ఇది గ్రేటెస్టు రైవల్రీ! ఆఖరి ఓవర్‌ ఉద్వేగం.. బంతి బంతికీ మారిన సమీకరణం.. గెలిచేంత వరకు ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ! ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) 130 కోట్ల మందిని మురిపించాడు. మెల్‌బోర్న్‌ మైదానాన్ని ఉర్రూతలూగించాడు. అఖండ భారతావనికి ఒక్కరోజు ముందుగానే దీపావళి తీసుకొచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 తొలి సూపర్‌ 12 మ్యాచులో టీమ్‌ఇండియాను గెలిపించాడు.

ముందే వచ్చిన దీపావళి

విరాట్‌ కోహ్లీకి తోడుగా హార్దిక్‌ పాండ్య (40; 37 బంతుల్లో 1x4, 2x6) చెలరేగిన వేళ టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. యూఏఈలో టీ20 ప్రపంచకప్‌, ఆసియాకప్‌ ఓటములకు ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. దాయాది పాకిస్థాన్‌ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను సమయోచితంగా ఛేదించింది. ఒక్కో ఇటుక పేర్చినట్టు.. లెక్కపెట్టుకొని మరీ స్కోరు చేసింది. 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది.  అంతకు ముందు బాబర్‌ సేనలో ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్‌ మసూద్‌ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. బౌలింగ్‌లో అర్షదీప్‌ సింగ్‌ (3/32), హార్దిక్‌ పాండ్య (3/30) రాణించారు.

టాప్‌ ఆర్డర్‌ కుదేలు

టార్గెట్‌ 160.. ఫామ్‌లోనే టాప్‌ 6 బ్యాటర్లు.. సెకండాఫ్‌లో బంతి స్వింగవ్వడం లేదు.. ఇంకేం టీమ్‌ఇండియా సులభంగా ఛేదించగలదనే అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పాకిస్థాన్‌ బౌలర్లు ప్రపంచడమైన వేగంతో బంతులేసి హిట్‌మ్యాన్‌ సేనను ఒత్తిడిలోకి నెట్టారు. తొలి ఓవర్లో ఓపెనర్లు షాహిన్‌షా అఫ్రిదిని ఆచితూచి ఆడారు. రెండో ఓవర్లో నసీమ్ షా వేసిన బంతిని ఎలా ఆడాలో నిర్ణయించుకోలేక కేఎల్‌ రాహుల్‌ (4) వికెట్ల మీదకు ఆడుకున్నాడు. మరికాసేపటికే రోహిత్‌ శర్మ (4) స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఇఫ్తికార్‌ మహ్మద్‌ అందుకున్నాడు. దాంతో 10కే భారత్‌ 2 వికెట్లు నష్టపోయింది. దూకుడుగా ఆడబోయిన సూర్యకుమార్‌ (15; 10 బంతుల్లో 2x4)ను హ్యారిస్‌ రౌఫ్‌ ఔట్‌ చేశాడు. 6.1వ బంతికి అక్షర్‌ పటేల్‌ (2) రనౌట్‌ అవ్వడంతో టీమ్‌ఇండియా 31-4తో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.

ఛేజ్‌ మాస్టర్‌కు తోడుగా పాండ్య

కీలక సమయంలో ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ, కుంగ్‌ఫూ పాండ్య క్రీజులో నిలబడ్డారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ బంతికి అలవాటు పడ్డారు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపించారు. ఐదో వికెట్‌కు 78 బంతుల్లో 113 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. 10 ఓవర్లకు 45-4గా ఉన్న స్కోరును 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు. ఆఖరి 30 బంతుల్లో 60 పరుగులు అవసరమైన తరుణంలో విరాట్‌ కోహ్లీ తన అనుభవాన్ని చాటాడు. చూడచక్కని షాట్లతో పాక్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. సమీకరణాన్ని 12 బంతుల్లో 31గా మార్చాడు. 19వ ఓవర్‌ ఆఖరి రెండు బంతుల్ని సిక్సర్‌గా మలిచి 15 రన్స్‌ రాబట్టాడు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు 16 రన్స్‌ కావాలి. తొలి బంతికే హార్దిక్‌ ఔటయ్యాడు. తర్వాతి 2 బంతుల్లో 3 రన్స్‌ వచ్చాయి. నోబాల్‌గా వేసిన నాలుగో బంతిని విరాట్‌ సిక్స్‌ బాదేశాడు. ఫ్రీహిట్‌ బంతికి 3 పరుగులు తీశాడు. 5వ బంతికి డీకే (1) ఔటవ్వడంతో 2 బంతుల్లో 2 రన్స్‌ అవసరం అయ్యాయి. బౌలర్‌ లెగ్‌సైడ్‌ వేసిన బంతిని యాష్‌ (1*) ప్రశాంతంగా వదిలేశాడు. ఆఖరి బంతిని ఫీల్డర్ల మీదుగా పంపించి సింగిల్‌ తీసి విజయం అందించాడు. 

బౌలర్లు భళా!

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఆకాశం మేఘావృతమై ఉండటం, చల్లని గాలి వీస్తుండటం, గాల్లో తేమ ఎక్కువగా ఉండటంతో టీమ్‌ఇండియా పేసర్లు రెచ్చిపోయారు. తొలి ఓవర్లోనే భువనేశ్వర్‌ కుమార్‌ బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసి రిజ్వాన్‌ను ఇబ్బంది పెట్టాడు. రెండో ఓవర్లో వేసిన తొలి బంతికే బాబర్‌ ఆజామ్‌ (0)ను అర్షదీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గోల్డెన్‌ డక్‌గా వెనక్కి పంపించాడు. అప్పటికి స్కోరు ఒకటి. మరికాసేపటికే రిజ్వాన్‌ (4)నూ అతడే ఔట్‌ చేశాడు.

అహ్మద్‌, మసూద్‌ హాఫ్‌ సెంచరీలు

ఒత్తిడిలోకి వెళ్లిన పాక్‌ను ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాన్‌ మసూద్‌ ఆదుకున్నారు. పేసర్లను ఆచితూచి ఆడారు. అక్షర్‌ పటేల్‌ రాగానే భారీ సిక్సర్లతో రెచ్చిపోయారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 50 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 91 వద్ద అహ్మద్‌ను షమి ఔట్‌ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్య వరుసగా షాదాబ్‌ ఖాన్‌ (5), హైదర్‌ అలీ (2), మహ్మద్‌ నవాజ్‌ (9)ను ఔట్‌ చేసి ఒత్తిడి పెంచాడు. చివర్లో మసూద్‌, బౌండరీలు బాది హాఫ్‌ సెంచరీ సాధించాడు. షాహిన్‌ అఫ్రిది (16; 8 బంతుల్లో 1x4, 1x6) మెరుపు షాట్లు ఆడి స్కోరును 159/8కి చేర్చాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget