ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మనదే హవా- బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్
ICC ODI Rankings : ప్రపంచకప్ లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతున్న వేళ ICC ర్యాంకింగ్స్ లో జట్టుతోపాటు భారత ఆటగాళ్లు కూడా అగ్రస్థానంలో నిలిచారు.
Mohammed Siraj No1 ODI bowler: క్రికెట్ వన్డే ప్రపంచకప్ లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతున్న వేళ ICCర్యాంకింగ్స్ లో జట్టుతోపాటు భారత ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలిచారు. వన్డే ర్యాకింగ్స్ లోభారత్ జట్టు ఇప్పటికే మొదటి స్థానంలో కొనసాగుతుండగా, బ్యాటర్ల విభాగంలో భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. 830 పాయింట్లతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను వెనక్కు నెట్టాడు. 824 పాయింట్లతో బాబర్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 4, రోహిత్ శర్మ 6వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్ మరోసారి మొదటి స్థానానికి ఎగబాకాడు. కుల్ దీప్ యాదవ్ నాలుగు, జస్ ప్రిత్ బుమ్రా 8, మహ్మద్ షమీ 10వ స్థానంలో నిలిచారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఇద్దరు అగ్రస్థానాలను సాధించారు. బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ నంబర్‌వన్ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను గిల్ వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 830 పాయింట్లతో ముందున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకపై 92 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడటంతో బాబర్ ను దాటుకు వచ్చాడు గిల్. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. ఆ స్థానాన్ని ఆక్రమించిన నాలుగవ ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ మాత్రమే నెంబర్ వన్ బ్యాటర్ స్థానాన్ని ఆక్రమించారు. ఇక అతి తక్కువ ఇన్నింగ్స్‌ల పరంగా వేగంగా ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ధోని 38 ఇన్నింగ్స్‌ల్లోనే నంబర్ వన్ బ్యాటర్‌గా నిలవగా.. గిల్ 41 ఇన్నింగ్స్‌ల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఈ ఘనత దక్కించుకున్నఅతి పిన్న వేయస్కుడు కూడా గిల్లే.
ఇటు బౌలింగ్‌లో సిరాజ్.. రెండు పాయింట్లు ఎగబాకి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా జరుగుతున్న వరల్డ్‌ప్ లో అతను ఇప్పటికే 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 709 రేటింగ్ పాయింట్లున్నాయి. అతడి వెనుకనే దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 694 పాయింట్లుతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆ తరువాత స్థానాల్లో ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా, కుల్‌దీప్, షహీన్ అఫ్రిది నిలిచారు.
అలాగే ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ శ్రీలంక పేసర్ మదుషంక 31 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకులోకి వచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గాన్ మాజీ సారథి మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్‌లో 37వ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు ఆడాయి. అందులోనూ భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన నంబర్ వన్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా... ఈ ప్రపంచకప్‌లో తాను ఎలాంటి ఫామ్‌లో ఉందో చూపించింది.