ICC T20 World Cup 2026 Ticket Price: కేవలం 100 రూపాయలకే T20 ప్రపంచ కప్ 2026 టికెట్! ఎప్పుడు, ఎక్కడ బుక్ చేసుకోవాలి?
ICC T20 World Cup 2026 Ticket Price: T20 ప్రపంచ కప్ 2026 టిక్కెట్ల సేల్ ప్రారంభమైంది. భారత్‌లో ₹100, శ్రీలంకలో ₹300 నుంచి ప్రారంభ ధరగా నిర్ణయించారు.

ICC Men T20 World Cup 2026 Tickets: ICC పురుషుల T20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. ఇందులో గ్రూప్ స్టేజ్, సూపర్ 8, నాకౌట్ స్టేజ్ ఉంటాయి. 20 జట్ల మధ్య మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ భారతదేశ, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి, అయితే పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. భారతదేశంలో మ్యాచ్‌ల టిక్కెట్లు ₹100 నుంచి ప్రారంభమవుతాయి, అయితే శ్రీలంకలో మ్యాచ్‌ల కోసం చౌకైన టికెట్ దాదాపు ₹300.
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒక ప్రకటనలో, "ICC ఈరోజు పురుషుల T20 ప్రపంచ కప్ కోసం టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది, ఈ ప్రధాన కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు అందుబాటులో ఉంచడానికి ప్రారంభ టిక్కెట్ల ధరలు తక్కువగా ఉన్నాయి. అమ్మకాలు భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటలకు ప్రారంభమయ్యాయి. భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో ధరలు కేవలం ₹10, శ్రీలంకలో దాదాపు ₹300 నుచి ప్రారంభమవుతాయి."
T20 ప్రపంచ కప్ 2026 టికెట్‌ను ఎలా బుక్ చేసుకోవాలి?
ప్రేక్షకులు క్రికెట్ ప్రపంచ కప్ వెబ్‌సైట్ (https://tickets.cricketworldcup.com)ని సందర్శించడం ద్వారా లేదా నేరుగా బుక్ మై షో వెబ్‌సైట్ లేదా యాప్‌ని ఉపయోగించడం ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో మీరు ప్రతి జట్టుకు జెండాలను చూస్తారు. మీరు టిక్కెట్‌లను బుక్ చేయాలనుకుంటున్న మ్యాచ్ కోసం ఆ జట్టుపై క్లిక్ చేయండి.
ఉదాహరణకు, భారతదేశం పేరుపై క్లిక్ చేయడం ద్వారా టీమ్ ఇండియా మ్యాచ్‌ల జాబితా కనిపిస్తుంది. మీరు టిక్కెట్‌లను బుక్ చేయాలనుకుంటున్న మ్యాచ్‌పై క్లిక్ చేయండి. మీరు ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై క్లిక్ చేయాలని అనుకంటే...
మీరు మొదట లాగిన్ అవ్వాలి, ఆపై "బుక్ నౌ" ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అప్పుడు మీరు మీ సీటును ఎంచుకోవచ్చు, టికెట్ ధరను చెల్లించవచ్చు. మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఒక లాగిన్ IDని ఉపయోగించి గరిష్టంగా రెండు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని గమనించండి.
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ టికెట్
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలో జరగనుంది. శ్రీలంకలో మ్యాచ్‌ల కోసం చౌకైన టికెట్ LKR 1500, ఇది భారత కరెన్సీలో 438 రూపాయలు.
Suryakumar Yadav has got a message for you - ticket sales are LIVE! 💥🔥
— Star Sports (@StarSportsIndia) December 11, 2025
The ICC T20 World Cup 2026 seats are disappearing fast, so don’t wait!
Don't miss & 𝗚𝗥𝗔𝗕 𝗬𝗢𝗨𝗥 𝗣𝗔𝗦𝗦𝗘𝗦 𝗡𝗢𝗪 ➡ https://t.co/G1qfBvsC1e#T20WorldCup pic.twitter.com/WqZSLx3DcU
మ్యాచ్‌లు జరిగే మైదానాలు వే
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
ఈడెన్ గార్డెన్, కోల్‌కతా
వాంఖడే స్టేడియం, ముంబై
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
ఎస్ఎస్‌సి క్రికెట్ గ్రౌండ్, కొలంబో
పల్లెకెలే క్రికెట్ స్టేడియం, క్యాండీ




















