Usman Khawaja: ఇక మిగిలింది చర్యలే, ఖవాజాకు విజ్ఞప్తిని తిరస్కరించిన ఐసీసీ
ICC News : ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ షాకిచ్చింది. దుస్తులు, వస్తువులకు సంబంధించిన ఐసీసీ నిబంధననను అతిక్రమించాడని ఐసీసీ వెల్లడించింది.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Denies Khawaja)కు ఐసీసీ(ICC) షాక్ ఇచ్చింది. నల్ల రిబ్బన్ ధరించినందుకు తనపై చర్యలు తీసుకోవద్దని ఖవాజా చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. దీంతో ఖవాజాపై ఐసీసీ ఏం చర్యలు తీసుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇంతకీ ఏం జరిగిందంటే...
పెర్త్(Perth) వేదికగా పాకిస్థాన్(Pakistan)తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖవాజా.. భుజానికి నల్ల రిబ్బన్ ధరించి బ్యాటింగ్‌కు దిగాడు. పాలస్థీనా(Palestine)కు మద్దతుగా తాను అలా చేశానని ఖవాజా చెప్పాడు. అయితే నిబంధనల ప్రకారం ఇది తప్పు కావడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ అనుమతి తీసుకోకుండా ఖవాజా నల్ల రిబ్బన్ ధరించడాన్ని ఐసీసీ తప్పుబట్టింది. ఐసీసీ నిబంధనలను ఖవాజా ఉల్లంఘించాడని... దుస్తులు, వస్తువులకు సంబంధించిన నిబంధననను అతిక్రమించాడని ఐసీసీ వెల్లడించింది. అతడిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇప్పటికే ఖవాజా తన తప్పును అంగీకరించి.. మరోసారి అలా చేయనని చెప్పాడని ఐసీసీ తెలిపింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఆటగాళ్లు ఏదైనా మెసేజ్‌ను జెర్సీలు, బ్యాటుపై లేదా షూ, రిబ్బన్ బ్యాండ్‌ల ద్వారా ప్రదర్శించడం నేరం. పాక్‌తో జరిగిన తొలి టెస్టులో ఖవాజా తొలి ఇన్నింగ్స్‌లో 41, రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
ముగిసిన వార్నర్ శకం
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టులకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ భాయ్ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్‌పై వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) గెలిచిన మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు.
ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన వార్నర్ టెస్ట్, వన్డే ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. కంగారు జట్టుకు ఒంటి చేత్తో మరపురాని విజయాలు అందించిన డేవిడ్ భాయ్.... కెరీర్‌ను ముగించాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి... ప్రతికూల పరిస్థితుల్లో కంగారు జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను వార్నర్ అందించాడు. 2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్ భాయ్ భాగమయ్యాడు. ఓపెనర్‌గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగరూలకు అందించాడు. ఆటతోనే కాకుండా.. తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ.. సోషల్ మీడియా ద్వారా తెలుగువాళ్లకు మరింత చేరువయ్యాడు. ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన విదేశీ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.