అన్వేషించండి

Dhruv Jurel : 'సెంచరీ మిస్ అయిందన్న బాధ లేదు' - కల సాకారమైందన్న జురెల్‌

Dhruv Jurel : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌..తన ప్రదర్శనపై స్పందించాడు.

Dhruv Jurel does not regret missing maiden Test hundred: రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌(Dhruv Jurel) తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్‌ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్‌ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని...  బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్‌ తెలిపాడు. నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా, స‌ర్ఫరాజ్ ఖాన్  త్వరగా ఔట్ అయినా శుభ్‌మ‌న్ గిల్‌, ధ్రువ్ జురెల్ లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వలేదు. వీరిద్దరు అభేధ్య‌మైన ఆరో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించి భార‌త్‌కు విజ‌యాన్ని అందించారు. 

జురెల్‌పై ప్రశంసల జల్లు
టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. జురెల్‌ను చూస్తుంటే మరో ధోనీలా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ధ్రువ్‌ జురెల్‌ ఏకాగ్రతలో మరో ధోనీని తలపిస్తున్నాడని గవాస్కర్‌ అన్నాడు. శతకం చేజారినాఉం ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడని గవాస్కర్‌ అన్నాడు.

అశ్విన్‌ రికార్డులే రికార్డులు
రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌, క్రికెట్‌ జీనియస్‌, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఈ చెన్నై స్పిన్‌ మాంత్రికుడు అందుకున్నాడు. అశ్విన్‌ కంటే ముందు 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కేవలం 8 మంది మాత్రమే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నారు. అలాగే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్‌ స్టోను అవుట్‌ చేసి అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్‌ స్పిన్నర్‌ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget