అన్వేషించండి

Hyderabad: తెలంగాణలో మెగా క్రికెట్ క్యాంపులు.. రిజిస్ట్రేషన్ లు షురూ

Hyderabad Cricket Association: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 9 జిల్లాలలో అభివృద్ధికి కట్టుబడుతూ, పేద క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ చరిత్రలో తొలిసారి వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సిద్ధమైంది.

Hca Summer Camps Schedule Released : తెలంగాణ రాష్ట్రంలో  క్రికెట్ అభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (HCA) అధ్యక్షుడు అర్శన‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు కార్యచ‌ర‌ణ ప్రారంభించారు. ఔత్సాహిక యువ క్రికెటర్లకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌   అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు. రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాలలో ఈనెల 20 నుంచి నెల రోజుల పాటు వీటిని ఉచితంగా నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.  ప్రతి జిల్లాల్లో మూడు ప్రదేశాల్లో వేస‌వి శిక్షణ శిబిరాల‌ను నిర్వహించ‌నున్నామ‌ని, ప్రతి క్యాంప్‌లో 80 నుంచి 100 మంది పిల్లల‌కు అవ‌కాశ‌మిస్తున్నామ‌ని చెప్పారు.   సుమారు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు కనీసం 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్‌ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ శిక్షణలో భాగంగా బాలురకు అండర్‌ – 14, 16, 19.. బాలికలకు అండర్‌ – 15, 19 వయో విభాగాల్లో ఉచిత ఈ క్యాంపులను నిర్వహించనున్నారు.  నేటి నుంచి   ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్‌ ప్రక్రియ మొదలవనుండగా ఆసక్తిగలవారు 18వ తేదీ (వ‌చ్చే గురువారం) సాయంత్రం 6 గంట‌ల లోపు ఆన్‌లైన్‌లో త‌మ పేర్లను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలని  కోరారు. మరి న్ని వివరాలకు హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌ (http://www. hycri cket.org) ను సంప్రదించాలని సూచించారు.   సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు, ఉద‌యం 10 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు శిక్షణ శిబిరాల‌ను  నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  ఈ స‌మ్మర్ క్యాంప్స్‌ను ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఎవ‌రికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన‌వ‌స‌రం లేదని జ‌గ‌న్‌మోహ‌న్ రావు  ఇప్పటికే స్పష్టం చేశారు.  శిక్షణ సమయంలో 30 రోజుల పాటు క్రికెటర్లకు పౌష్ఠికాహారం సైతం అందించనున్నారు. వేసవి శిక్షణ శిబిరాలను దీర్ఘకాలంలో క్రికెట్‌ అకాడమీలుగా రూపుదిద్దనున్నట్లు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ఇప్పటికే  ప్రకటించిన విషయం గుర్తు చేశారు. ఏ జిల్లాలోనైనా నిపుణులైన కోచ్‌లు, ఫిజియోలు అందుబాటులో లేకుంటే.. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఎన్‌ఐఎస్‌ కోచ్‌లు, ఫిజియోలను జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. సమ్మర్‌ క్యాంప్‌ అనంతరం జిల్లా జట్లను ఎంపిక చేసి హైదరాబాద్‌లో జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లే వెల్లడించారు. జింఖానా తరహా క్రికెట్‌ మైదానాలను హైదరాబాద్‌లో మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు హెచ్‌సీఏ ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు.

కేంద్రాల వివ‌రాలు:

వ‌రంగ‌ల్‌: 98495 70979

పరకాల: 9666206662 

ములుగు: 90301 30727

మ‌హ‌బూబాబాద్‌: 98664 79666

భూపాల‌ప‌ల్లి: 88978 05683

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌: 94400 57849

గ‌ద్వాల్‌: 98859 55633

నాగ‌ర్ క‌ర్నూల్‌: 98854 01701

సంగారెడ్డి: 94408 47360

సిద్ధిపేట: 98499 55478

మెద‌క్‌: 99663 62433

నిజామాబాద్‌: 98490 73809

కామారెడ్డి: 96666 77786

ఆర్మూర్‌: 96405 73060

క‌రీంన‌గ‌ర్‌: 80087 29397

గోదావ‌రి ఖ‌ని: 98663 51620

సిరిసిల్ల: 94943 62362

ఖ‌మ్మం: 98486 62125

కొత్తగూడెం: 97050 07555

గౌత‌మ్‌పూర్: 99482 21777

మంచిర్యాల‌: 94400 10696

ఆదిలాబాద్‌: 94402 07473

సిర్‌పూర్‌: 94923 33333

జింఖానా: 90301 30346

ఫ‌ల‌క్‌నామా: 98852 95387

అంబ‌ర్‌పేట‌: 98665 82836

లాలాపేట‌: 99664 62667

మాదాపూర్‌: 80195 35679

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth home village: సీఎం రేవంత్ క్లాస్‌మేట్  కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
సీఎం రేవంత్ క్లాస్‌మేట్ కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Advertisement

వీడియోలు

I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth home village: సీఎం రేవంత్ క్లాస్‌మేట్  కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
సీఎం రేవంత్ క్లాస్‌మేట్ కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
WhatsApp: సిమ్ లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్ ఇక పని చేయదు- కేంద్రం సంచలన ఆదేశాలు
సిమ్ లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్ ఇక పని చేయదు- కేంద్రం సంచలన ఆదేశాలు
Nuvvu Naaku Nachav Re Release: జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
Cars Under 10 lakh with 6 Airbags: రూ.10 లక్షల రేంజ్‌లో 6 ఎయిర్ బ్యాగ్స్‌తో సన్రూఫ్ కలిగిన కార్లు ఇవే
రూ.10 లక్షల రేంజ్‌లో 6 ఎయిర్ బ్యాగ్స్‌తో సన్రూఫ్ కలిగిన కార్లు ఇవే
Embed widget