అన్వేషించండి

Glenn Maxwell Record: వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు మ్యాక్స్ వెల్, ఆల్ రౌండర్ ఖాతాలో అరుదైన రికార్డు

Highest Individual Score in ODI Run Chase: వన్డే క్రికెట్ చరిత్రలోనే ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ఆసీస్ ఆర్ రౌండర్ మ్యాక్స్ వెల్ నిలిచాడు.

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్తాన్ పై మాజీ చాంపియన్ ఆసీస్ ను విజేతగా నిలిపాడు మ్యాక్సీ. అప్గాన్ బౌలర్ల దాటికి 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓ దశలో 91/7 గా కనిపించిన ఆసీస్ నెగ్గుతుందని ఎవరూ భావించలేదు. కానీ మ్యాక్స్ వెల్ తన వన్డే కెరీర్ లో తొలి డబుల్ సెంచరీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ (201 నాటౌట్; 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో అద్వితీయ ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ఆసీస్ ఆర్ రౌండర్ మ్యాక్స్ వెల్ నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ తో పాటు క్రికెట్ చరిత్రలోనే ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ అయ్యాడు.

వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా అఫ్గాన్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ సిక్సర్ తో డబుల్ సెంచరీ సాధించాడు. సెంచరీ తరువాత కండరాలు పట్టేసి, కాలు నొప్పి వేధిస్తున్నా ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసుకుంటూ దాదాపుగా స్ట్రైకింగ్ భారాన్ని, జట్టును గెలిపించే బాధ్యతను తనపై వేసుకుని జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. పాట్ కమిన్స్ (12 నాటౌట్) మరో ఎండ్ లో వికెట్ కాపాడాడు. ఓ దశలో మ్యాక్స్ వెల్ బాధను చూడలేక టీమ్ మేనేజ్ మెంట్ అతడ్ని రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పిలిపించి స్పిన్నర్ ఆడమ్ జంపాను బ్యాటింగ్ కు పంపించాలని చూసింది. అప్పుడు సైతం ఆసీస్ విజయానికి మరో 50 పరుగుల మీదే అవసరం ఉంది. కానీ పట్టుదలగా ఆడిన మ్యాక్స్ వెల్ పలు రికార్డులు బద్దులకొట్టాడు. జట్టును గెలిపించే క్రమంలో 158 వ్యక్తిగత పరుగులు దాటడంతో అద్భుత రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

ప్రపంచ కప్ లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడు మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఆండ్రూ స్ట్రాస్ పేరిట ఉండేది. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో భారత్ పై స్ట్రాస్ చేసిన 158 పరుగుల రికార్డు బద్ధలైంది. ఆపై ఇన్నింగ్స్ 47వ ఓవర్లో 195 వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ అయ్యాడు మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో జరిగిన వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. ఛేజింగ్ లో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ 193 పరుగుల వద్ద రనౌటయ్యాడు. కానీ ఆ మ్యాచ్ లో పాక్ ఓటమిపాలైంది. కాగా, మ్యాక్సీ తాజా ఇన్నింగ్స్ కు ముందు ఫకర్ జమాన్ 193 రన్స్ వన్డేల్లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. ఈ జాబితాలో షేన్ వాట్సన్ (185) మూడో స్థానంలో ఉన్నాడు. 2005లో శ్రీలంకపై ఎంఎస్ ధోనీ (183), 2012లో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ (183) ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.

ఓవరాల్ గా చూస్తే.. వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ మ్యాక్స్ వెల్. వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో సైతం ఛేదనలో నమోదైన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్సీదే కావడం విశేషం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget