అన్వేషించండి

Team India Bowling Coach: టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా మోర్కెల్‌, పట్టుబడుతున్న గంభీర్‌

Gautam Gambhir: ఇటీవలే భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తర్వాత వచ్చిన గంభీర్, భారత బౌలింగ్ కోచ్‌గా వెటరన్ ప్రొటీస్ పేసర్‌ను నియమించాలని బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం.

Gautam Gambhir Proposes Morne Morkel's Name For India's Bowling Coach: టీమిండియా(Team India) హెడ్‌ కోచ్‌గా నియమితులైన గంభీర్‌(Gautam Gambhir) తన మార్క్‌ చాటుకోవాలని చూస్తున్నాడు. భారత బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్‌ (Morne Morkel)కావాలని గంభీర్‌ పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో గంభీర్‌, మోర్నీ మోర్కెల్‌ కలిసి లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) తరపున కోచ్‌గా పని చేశారు. ఇప్పుడు కూడా మోర్నెల్‌ను బౌలింగ్ కోచ్‌గా కావాలని బీసీసీఐ(BCCI_ని గంభీర్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే గంభీర్‌ విజ్ఞప్తిపై బీసీసీఐ ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. లక్నోకు గంభీర్ రెండేళ్లపాటు మెంటార్‌గా పనిచేశాడు. మోర్కెల్ అంతర్జాతీయ, ఐపీఎల్‌లో సమర్థ కోచ్‌గా గుర్తింపు పొందాడు.  2018లో 39 ఏళ్ల వయస్సులో మోర్కెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సాంకేతిక అంశాల్లో మోర్కెల్‌కు బాగా ప్రావీణ్యం ఉంది. తనకు సహాయ కోచ్‌లుగా సౌకర్యంగా ఉండే వ్యక్తులు కావాలని కోరుకుంటున్న గంభీర్‌.. మోర్కెల్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. గంభీర్‌-మోర్కెల్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.  మోర్కెల్‌ను తన కోచింగ్ టీమ్‌లో చేర్చుకోవడానికి గంభీర్‌ ఆసక్తి చూపుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బౌలింగ్ కోచ్ స్థానానికి లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే బౌలింగ్‌ కోచ్‌గా జహీర్ ఖాన్‌ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే బౌలింగ్‌ కోచ్‌పై 
బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.
 
అక్కడినుంచి వస్తాడా..?
మోర్కెల్ కుటుంబం ఇప్పుడు  ఉత్తర సిడ్నీలోని ఖరీదైన సీఫోర్త్ సబర్బ్‌లో నివసిస్తోంది. భారత బౌలింగ్‌ కోచ్‌గా మోర్కెల్‌ను నియమిస్తే అతను అక్కడి నుంచి భారత్‌ వస్తాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఛానల్ 9లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన మోర్కెల్‌ భార్య రోజ్ కెల్లీ, ఇద్దరు పిల్లలను వదిలి మోర్కెల్‌ ఇప్పటికిప్పుడు టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా వస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీసీసీఐ మోర్కెల్‌ను కోచ్‌గా నియమిస్తే గత మూడేళ్లుగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న పరాస్ మాంబ్రే స్థానంలో మోర్కెల్ నియమితుడు కానున్నాడు. 
 
అనుభవజ్ఞుడే కానీ...
గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు కోచ్‌గా మోర్కెల్‌ పనిచేశాడు. అయితే పదవీ కాలం ముగియకముందే మోర్కెల్‌ పాక్‌ కోచ్‌గా వైదొలిగాడు. మోర్కెల్ దక్షిణాఫ్రికా తరపున 2006- 2018 మధ్య కాలంలో 86 టెస్టులు, 117 వన్డేలు ఆడాడు. 44 టీ 20లు కూడా ఆడాడు. కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌కు అపార అనుభవం ఉంది. దక్షిణాఫ్రికాలో మోర్ని మోర్కెల్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికీ గంభీర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తుండడం... మోర్కెల్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: సీఎల్పీ భేటీలో అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థిత్వానికి ఆమోదం, సోమవారం నామినేషన్
సీఎల్పీ భేటీలో అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థిత్వానికి ఆమోదం, సోమవారం నామినేషన్
Polavaram Files Case: పోలవరం ఫైళ్లు దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై వేటు, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
పోలవరం ఫైళ్లు దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై వేటు, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
Kolkata Doctor Case: ప్రధాని మోదీకి లేఖ రాసిన పద్మ అవార్డు గ్రహీతలైన డాక్టర్లు, డిమాండ్లు ఇవే
ప్రధాని మోదీకి లేఖ రాసిన పద్మ అవార్డు గ్రహీతలైన డాక్టర్లు, డిమాండ్లు ఇవే
Revanth Reddy: హీరో ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
హీరో ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP DesamSardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABPPonniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: సీఎల్పీ భేటీలో అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థిత్వానికి ఆమోదం, సోమవారం నామినేషన్
సీఎల్పీ భేటీలో అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థిత్వానికి ఆమోదం, సోమవారం నామినేషన్
Polavaram Files Case: పోలవరం ఫైళ్లు దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై వేటు, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
పోలవరం ఫైళ్లు దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై వేటు, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
Kolkata Doctor Case: ప్రధాని మోదీకి లేఖ రాసిన పద్మ అవార్డు గ్రహీతలైన డాక్టర్లు, డిమాండ్లు ఇవే
ప్రధాని మోదీకి లేఖ రాసిన పద్మ అవార్డు గ్రహీతలైన డాక్టర్లు, డిమాండ్లు ఇవే
Revanth Reddy: హీరో ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
హీరో ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
Vasudeva Reddy Arrest: ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు!
ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు! రహస్య ప్రాంతంలో విచారణ
Kolkata Doctor Case: కోల్‌కత్తా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, త్వరలోనే విచారణ
కోల్‌కత్తా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, త్వరలోనే విచారణ
Rishab Shetty: ఓటీటీలు కన్నడ సినిమాలు కొనవు, తప్పక యూట్యూబ్‌లో పెడుతున్నాం - రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు
ఓటీటీలు కన్నడ సినిమాలు కొనవు, తప్పక యూట్యూబ్‌లో పెడుతున్నాం - రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు
KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
Embed widget