Year Ender 2022: ఈ సంవత్సరం సెంచరీ చేసి ఫాంలోకి వచ్చిన బ్యాటర్లు వీరే - ఎందరున్నారో చూడండి!
2022లో తమ సెంచరీల కరువును ముగించిన బ్యాటర్లు వీరే!
Year Ender 2022 Cricket: 2022 ముగియబోతోంది. ఈ సంవత్సరం క్రికెట్‌లో చాలా సంఘటనలు జరిగాయి. ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లి నుంచి స్టీవ్ స్మిత్ వరకు చాలా మంది ఈ సంవత్సరం సుదీర్ఘ సెంచరీల కరువుకు తెరపడింది. ఈ బ్యాట్స్‌మెన్‌లు నిరంతరం పరుగులు చేస్తున్నారు కానీ సెంచరీ చేయలేకపోయారు. ఈ ఏడాది సెంచరీల కరువును ఏ బ్యాట్స్‌మెన్‌లు ముగించారో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ
2019 నవంబర్ 22వ తేదీన విరాట్ తన 70వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత కరోనా బ్రేక్ కారణంగా క్రికెట్‌లో విరామం ఏర్పడింది. మైదానంలోకి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ 2020లో 22 మ్యాచ్‌ల్లో 842 పరుగులు చేశాడు కానీ సెంచరీ చేయలేకపోయాడు. 2021లో అతను 24 మ్యాచ్‌లలో 964 పరుగులు చేశాడు. కానీ ఈ సంవత్సరం కూడా అతను తన బ్యాట్‌తో సెంచరీ చేయలేదు.
2022లో సగం సంవత్సరం కూడా గడిచిపోయింది. అలాగే కోహ్లి కూడా సెంచరీ కోసం పోరాడుతున్నాడు. 2022 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 122 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను ఆడి టీ20 ఇంటర్నేషనల్‌లో తన మొదటి సెంచరీని కూడా సాధించాడు. నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై 113 పరుగులు చేసి వన్డేల్లో 44వ సెంచరీని నమోదు చేశాడు.
స్టీవ్ స్మిత్
2021 జనవరిలో భారత్‌పై 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. స్టీవ్ స్మిత్ తన ఫామ్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత 2022 జూలైలో స్మిత్ నిరీక్షణ కూడా ముగిసింది. అతని బ్యాట్ సెంచరీని చూసింది. శ్రీలంకపై క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ సెంచరీ సాధించాడు. దీని తర్వాత అతను డబుల్ సెంచరీతో సహా మరో రెండు సెంచరీలు చేశాడు.
డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ 2020 జనవరి 14వ తేదీన భారత్‌పై తన 43వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. దీని తర్వాత అతను 67 ఇన్నింగ్స్‌ల్లో కూడా సెంచరీ చేయలేకపోయాడు. 2022 నవంబర్ 22వ తేదీన వార్నర్ 1043 రోజుల కరువును ముగించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ODI మ్యాచ్‌లో 106 పరుగుల ఇన్నింగ్స్‌ను అతను ఆడాడు.
చతేశ్వర్ పుజారా
2019 జనవరి 3వ తేదీన ఆస్ట్రేలియాపై ఛతేశ్వర్ పుజారా 193 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పుజారా 2020, 2021లో కష్టపడి 18 టెస్టుల్లో 865 పరుగులు చేశాడు. 2022లో డిసెంబర్ 14వ తేదీన బంగ్లాదేశ్‌పై పుజారా 1443 రోజుల కరువును ముగించాడు. అజేయంగా 102 పరుగులు చేశాడు.
View this post on Instagram