By: ABP Desam | Updated at : 04 Jan 2023 01:26 PM (IST)
Edited By: nagavarapu
విరాట్ కోహ్లీ (source: twitter)
Kohli - Sachin: క్రికెట్ లో ఒక సామెత ఉంది. రికార్డులు అనేవి బద్దలు కొట్టడానికే ఉంటాయని. అవును ఇది నిజమే. కొందరు ఆటగాళ్లు సృష్టించిన రికార్డులను కొంతకాలం తర్వాత మరికొందరు చెరిపేస్తూ ఉంటారు. ఆ రికార్డులను దాటేస్తూ ఉంటారు. ఇప్పటివరకు అలా చాలా రికార్డులు బద్దలయ్యాయి. అయితే కొంతమంది ఆటగాళ్లు సృష్టించిన రికార్డులు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు అనిపిస్తాయి. అలాంటి ఒక రికార్డ్ భారత లెజెండరీ ఆటగాడు సచిన్ పేరిట ఉంది. అదే వంద సెంచరీలు. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు చేశాడు. అలాగే వన్డేల్లో 49 శతకాల రికార్డు. ఈ రెండూ టెండూల్కర్ పేరిట ఉన్నాయి.
సచిన్ కు దగ్గరగా కోహ్లీ
ఈ రికార్డులను ఎప్పటికీ ఎవరూ అందుకోలేరని కొన్నాళ్ల క్రితం వరకు క్రికెట్ పండితులు, అభిమానులు అనుకున్నారు. అయితే నేనున్నానంటూ దూసుకొచ్చాడు మరో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. నాలుగేళ్ల క్రితం వరకు సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీ సచిన్ వంద వందల రికార్డును బద్దలుకొట్టేలానే కనిపించాడు. ఇప్పటికే అతని ఖాతాలో 72 సెంచరీలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా పేలవ ఫాంతో సతమవుతున్న విరాట్ ప్రస్తుతం ఆ రికార్డును అందుకుంటాడో లేదో తెలియదు కానీ.. టెండూల్కర్ మరో రికార్డును మాత్రం తిరగరాసేందుకు చాలా దగ్గరగా ఉన్నాడు.
బద్దలు కొట్టేందుకు ఇదే అవకాశం
సచిన్ టెండూల్కర్ ఒక్క వన్డే ఫార్మాట్లోనే 49 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు విరాట్ కోహ్లీకి అవకాశం ఉంది. ఇప్పుడు విరాట్ వన్డేల్లో 44 సెంచరీలతో ఉన్నాడు. మరో 6 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బద్దలవుతుంది. ఈ ఏడాది టీమిండియా చాలా వన్డేలు ఆడనుంది. అలాగే వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. కాబట్టి ఈ రికార్డును చేరుకోవడం కోహ్లీకి పెద్ద కష్టమేమీ కాదు. సచిన్ 1989- 2012 మధ్య కాలంలో 463 వన్డేల్లో 49 శతకాలు అందుకున్నాడు. 2008 నుంచి కోహ్లీ 265 వన్డేల్లో 44 సెంచరీలతో కొనసాగుతున్నాడు.
అయితే గత నాలుగేళ్లుగా గడ్డు దశను ఎదుర్కొంటున్న కోహ్లీ సచిన్ రికార్డును చెరిపేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. విరాట్ ప్రస్తుతమున్న ఫాంలో మరో 6 సెంచరీలు చేయడమంటే అంత సులభం కాదు. కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే ఈ ఏడాదిలోనే అది జరగాలి. ఎందుకంటే ప్రస్తుతం 34 ఏళ్లున్న విరాట్ ఇంకెంతకాలమో క్రికెట్ లో కొనసాగలేడు. కాబట్టి వన్డే ప్రపంచకప్ కూడా ఉన్న నేపథ్యంలో కోహ్లీ మరో 6 శతకాలు బాది టెండూల్కర్ రికార్డును చెరిపేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This shot of virat kohli has different fanbasepic.twitter.com/60GWwerwTq
— S. (@Kohlis_Era) January 4, 2023
Thanks for this moment 2022.
— Ratnadeep (@_ratna_deep) January 1, 2023
71st for Virat Kohlipic.twitter.com/uxfvRkMftF
Shaheen Afridi Marriage: షాహిద్ అఫ్రిది కుమార్తెను వివాహమాడిన పాక్ యువ బౌలర్ షహీన్
IND Vs AUS: మొదటి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ - గాయంతో కీలక ఆటగాడు దూరం!
IND vs NZ: ఆ రికార్డు సృష్టించిన మొదటి భారత ఆల్‌రౌండర్ హార్దికే - ఏంటో తెలుసా?
Ashwin On Steve Smith: మీ స్లెడ్జింగ్, మైండ్‌గేమ్స్ మాకు తెలుసులే! ఆసీస్‌కు యాష్ పవర్ఫుల్ పంచ్!
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?