Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్
Sir Don Bradman in his last Test innings: క్రికెట్ చరిత్రలో ఫస్ట్ లెజెండ్ గా వ్యవహరించే ఆటగాడు సర్ డాన్ బ్రాడ్ మన్. కానీ ఫేమస్ డకౌట్ కూడా ఆయన ఖాతాలోనే ఉందంటే నమ్ముతారా. ఇది చదివితే మీకే అర్థమవుతుంది.
Don Bradman Famous Duck Out: సాధారణంగా క్రికెట్ లో ఏదైనా ఫార్మాట్లో బ్యాటింగ్ యావరేజ్ 50 దాటితే ఆ ప్లేయర్ సూపర్ ఫాంలో ఉన్నాడని, కొన్ని ఇన్నింగ్స్ తరువాత సైతం అదే యావరేజీ కొనసాగిస్తే వన్ ఆఫ్ ద గ్రేట్స్ అంటూ అతణ్ని పొగుడుతుంటారు. ఇక ఆపైన అంతకంతకూ యావరేజ్ పెరుగుతూ పోతే డెఫినెట్లీ లెజెండ్ ఆఫ్ ద లెజెండ్స్ అంటారు. అలాంటి కోవలోకి వచ్చే అతికొద్ది మంది క్రికెటర్లలో ఫస్ట్ ప్లేస్ డాన్ బ్రాడ్ మన్‌దే. కానీ అలాంటి మేటి క్రికెటర్ గేమ్ హిస్టరీలోనే అత్యంత ఫేమస్ అని చెప్పుకునే డకౌట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
బ్రాడ్ మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 99.94 యావరేజ్ తో 6 వేల 996 పరుగులు చేశాడు. సాధారణంగా 50, 60 ఉంటేనే గ్రేట్ అంటారు. అలాంటిది బ్రాడ్‌మన్ బ్యాటింగ్ యావరేజ్ 99.94. కేవలం వీడియో గేమ్స్ లోనే ఈ కాలంలో అంత యావరేజ్ వస్తుందేమో. ఆయన తన ఆఖరి మ్యాచ్ ఆడేముందు... టెస్టుల్లో బ్రాడ్ మన్ బ్యాటింగ్ యావరేజ్ 101.39 ఉండేది. ఏ క్రికెటర్ సాధించలేని కాదు కదా ఊహించలేని బ్యాటింగ్ సగటు అది.
కెరీర్‌లో చివరి ఇన్నింగ్స్.. ఆ 4 పరుగులు
టెస్టుల్లో బ్యాటింగ్ యావరేజ్ 100తో తన కెరీర్ ను ముగించాలంటే.... ఆఖరి టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం నాలుగంటే నాలుగు పరుగులు చేస్తే సరిపోయేది. ఆయన 7వేల పరుగుల మార్క్ ను చేరుకునేవారు. అదే సమయంలో 100 టెస్ట్ యావరేజ్ ను కూడా నిలుపుకునేవారు. కానీ అలా జరగలేదు. ఇంగ్లండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. విధి విచిత్రం ఏంటోగానీ 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్స్ 117 పరుగుల మంచి పార్టనర్ షిప్ నెలకొల్పాక తొలి వికెట్ పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చారు సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్. కానీ షాక్.. లెగ్ స్పిన్నర్ హోలీస్ బౌలింగ్ లో రెండో బాల్‌కే డకౌట్ గా వెనుదిరిగారు.
కెరీర్ చివరి ఇన్నింగ్స్‌లో నో ఛాన్స్
రెండో ఇన్నింగ్స్ ఉంటుంది కదా అంటారా. ఇంత గొప్ప లెజెండ్ 4 పరుగులు కొట్టలేకపోరేమో అని ఫ్యాన్స్ అంతా సర్దిచెప్పుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు, ఆస్ట్రేలియా బౌలర్లు డాన్ బ్రాడ్‌మన్‌కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో389 కి ఆలౌటైన తర్వాత రెండో ఇన్నింగ్స్ కు వచ్చిన ఇంగ్లాండ్... కేవలం 188 కే చాప చుట్టేసింది. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపినా ఆసీస్ స్కోర్‌ను ఇంగ్లాండ్ దాటలేకపోయింది. అంటే ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్ విజయం దక్కింది. బ్రాడమన్ కు రెండోసారి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. సో అలా 7వేల పరుగుల మైలురాయికి 4 పరుగుల దూరంలో, టెస్ట్ యావరేజ్ 100కు కేవలం 0.06 శాతం దూరంలో నిలిచిపోయారు డాన్ బ్రాడ్ మన్.
అంత అద్భుతమైన బ్రాడ్‌మన్ కెరీర్ కు అద్భుతమైన ముగింపు దక్కుతుందన్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. దాదాపుగా అసాధ్యం అనుకున్న రికార్డు దగ్గర దాకా వచ్చి 4 పరుగులు చేయలేక తొలి ఇన్నింగ్స్‌లో డాన్ డకౌట్ అవటం, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో దీన్ని క్రికెట్ చరిత్రలోనే ఫేమస్ డకౌట్ గా పిలుస్తుంటారు.