అన్వేషించండి

సంజు శాంసన్ తన కెరీర్ లో లాస్ట్ మ్యాచ్ అడేసినట్టేనా? ఛాన్స్ లన్నీ వృధా చేసుకున్నాడా?

సంజు శాంసన్ తన కెరీర్ లో లాస్ట్ మ్యాచ్ అడేసినట్టేనా? ఇచ్చిన ఛాన్స్ లన్నీ వృధా చేసుకున్నాడా? అని చర్చ జరుగుతోంది.

న్యూజిలాండ్ తో జరిగిన ఐదు  T 20 ల సీరిస్ లో సంజుశాంసన్ స్కోర్ లు  10,6,0, 24,6. ఒక్క మ్యాచ్ లోనూ కనీసం 30 పరుగుల స్కోర్ అందుకోలేకపోయాడు. T 20 ప్రపంచ కప్పుకు సరిగ్గా నెల రోజుల ముందు జరిగిన ఈ న్యూజిలాండ్ సిరీస్ ఆటగాళ్ల ప్రదర్శన చెక్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు రెండు చేతులా అందిపూచ్చుకుంటే ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న సంజు శాంసన్ మాత్రం చేజేతులా పాడు చేసుకున్నాడు అంటున్నారు ఎనలిస్ట్ లు. దానితో T 20 వరల్డ్ కప్ లో సంజూ కు ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం రావడం కష్టమే అంటున్నారు మాజీలు.


సంజూ కోసం ఏకమైన క్రీడాభీమానులు.... కానీ 

బహుశా ఒక క్రికెటర్ కు అన్యాయం జరుగుతోంది అంటూ  దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అండగా నిలబడ్డ సందర్బం సంజూ విషయం లోనే జరిగింది. వినోద్ కాంబ్లీ నుండి మొదలుపెడితే మరే ఇతర క్రికెటర్ విషయం లోనూ ఇంత మద్దతు ప్రజల నుండి రాలేదు. ఒకానొక  దశ లో  బీసీసీఐ పెద్దలు సైతం సంజూ శాంసన్ విషయం లో ఫ్యాన్స్ నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న మాట వాస్తవం. సంజూ శాంసన్ లాంటి ట్యాలెంటెడ్ క్రికెటర్ కు సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్నది ఫ్యాన్స్ వాదన. T 20 ల్లో సరిగ్గా ఆడలేకపోతోన్న శుభమాన్ గిల్ ని కొనసాగిస్తూ సంజూ ను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు అన్న విమర్శలు మాజీల నుండి తీవ్రంగా వచ్చాయి. వీటన్నిటినీ పరిగణన లోనికి తీసుకున్న సెలక్షన్ కమిటీ కెప్టెన్ గిల్ ని పక్కన పెట్టి మరీసంజూ కు అవకాశం కల్పించారు.T20 వరల్డ్ కప్ ప్లేయర్స్ లిస్ట్ లో తన పేరు కనపడగానే ఫ్యాన్స్, మాజీ క్రికెటర్ లు సంతోషం వ్యక్తం చేశారు. 

వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోలేక పోయిన సంజూ

న్యూజిలాండ్ సిరీస్ లో అదరగొట్టి  సగర్వంగా T 20 వరల్డ్ కప్ లోకి అడుగు పెడతాడన్న ఫ్యాన్స్ ఆశలను వమ్ము చేస్తూ సంజూ శాంసన్ మాత్రం ఈ సీరిస్ లో తీవ్రంగా నిరాశ పరిచాడు. తిరుగులేని టాలెంట్ ఉంది అయినా కూడా  రన్స్ చేయలేక పోవడం తో ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో కనీసం బ్యాటింగ్ చేసే అవకాశం అన్నా వస్తుందా అన్నట్టు పరిస్థితి మారిపోయింది. నిన్న జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో 6పరుగులకే అవుట్ అయ్యాక  ఫీల్డింగ్ లో సంజూ బాడీ లాంగ్వేజ్ చూస్తే తనకీ ఆ విషయం అర్ధమైనట్టు స్పష్టంగా కనిపించింది. గత రెండేళ్లు గా సెలక్షన్ విషయం లో సంజూ లాంటి పరిస్థితే ఎదుర్కొన్న 'పాకెట్ డైనమేట్' ఇషాన్ కిషన్ ఈ సిరీస్ లో ఆదరగొట్టాడు. ముఖ్యంగా నిన్నటి మ్యాచ్ లో సంజూ, అభిషేక్ అవుట్ అయ్యాక అతను ఆడిన విధానం కొట్టిన షాట్స్ చేసిన సెంచురీ వచ్చే నెలలో జరిగే T 20 వరల్డ్ కప్ లో ఓపెనర్ అతనే ఇండియన్ ఓపెనర్ అన్న విషయాన్ని స్పష్టం చేసేసాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.  ఖశ్చితంగా వరల్డ్ కప్ లో ఇండియా తరపున అభిషేక్ తో కలిసి ఓపెన్ చేస్తాడు అనుకున్న సంజూ శాంసన్ కు ఇప్పుడు ఆడే అవకాశం వస్తుందా అన్న డౌట్స్ ఫ్యాన్స్ లోనే మొదలయితే అసలు వరల్డ్ కప్ లో ఆడిస్తారో లేక బెంచ్ ఫై కూర్చో పెట్టేస్తారో అన్న అనుమానాల మధ్య ఇషాన్ ఇప్పుడు ఆ స్థానానికి హాట్ ఫెవరెట్ అయి కూర్చున్నాడు..

నిలకడలేమే అసలు సమస్య

అద్భుతమైన ట్యాలెంట్ ఉంది.. తిరుగు లేని ఫ్యాన్ ఫాలోయింగూ ఉంది. అవకాశాలూ ఈ మధ్య బానే వచ్చాయి. కానీ నిలకడ లేమే సంజూ శాంసన్ అసలు సమస్య. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే మరో మ్యాచ్ లో నిర్లక్ష్యపూరిత షాట్ అడి అవుట్ ఆవుతాడు. ఇండియన్ క్రికెట్ లో విపరీతమైన పోటీ ఉంది. రోహిత్, కోహ్లీ, జడేజా లాంటి దిగ్గజాలే క్రొత్త వారికి చోటు ఇవ్వడం కోసం T 20 ల నుండి తప్పుకున్నారు. అలాంటి సమయంలో వచ్చిన అవకాశాల్ని అందుకోవడం లో సంజూ ఫెయిల్ అయ్యాడు అని అతని గణంకాలే చెబుతున్నాయి.

 ఇండియా తరపున T 20ల్లో నిన్న సంజూ చివరి మ్యాచ్ ఆడేశాడా.. ఎవరైనా గాయపడి దూరం అయితే తప్ప T 20 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ ఆడే అవకాశం కూడా సంజూ కి రాదా అన్న డౌట్స్ అందరిలో మొదలయ్యాయి. ఒకవేళ అదే జరిగినా ఇంతకు ముందు క్రికెట్ అభిమానుల నుండి వచ్చినంత మద్ధతు ఈసారి సంజూ కి రాకపోవచ్చు అన్న విశ్లేషణ లు నిన్నటి మ్యాచ్ తరవాత మొదలయ్యాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Riyan Parag Fined: డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
IPL 2026 GT VS RCB Result Update: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
Rajat Patidar Dismissal controversy: రజత్ పాటిదార్ అవుట్ పై మొదలైన కొత్త వివాదం! అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ఫైర్
రజత్ పాటిదార్ అవుట్ పై మొదలైన కొత్త వివాదం! అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ఫైర్
IPL 2026 SRH Record Chasing: వాంఖెడేలో SRH రికార్డు ఛేజింగ్.. ఫిఫ్టీల‌తో స‌త్తా చాటిన హెడ్, క్లాసెన్, వ‌రుస‌గా ఐదో విక్ట‌రీతో స‌న్ రైజ‌ర్స్ స‌త్తా.. ముంబైకి నిరాశ‌
వాంఖెడేలో SRH రికార్డు ఛేజింగ్.. ఫిఫ్టీల‌తో స‌త్తా చాటిన హెడ్, క్లాసెన్, వ‌రుస‌గా ఐదో విక్ట‌రీతో స‌న్ రైజ‌ర్స్ స‌త్తా.. ముంబైకి నిరాశ‌
Advertisement

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dinner with the Real Winners: డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
IPL 2026 GT VS RCB Result Update: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Riyan Parag Fined: డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
Andhra Pradesh Cabinet meeting: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Hansika: బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
Embed widget