News
News
X

CCL 2023 Squad: ఫిబ్రవరి 18నుంచి సీసీఎల్- 2023 లీగ్- మార్చి 19న హైదరాబాద్ లో ఫైనల్

CCL 2023 Squad: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2023 కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మొత్తం 8 ఇండస్ట్రీలు పాల్గొనే సీసీఎల్ 2023 ఎడిషన్ ఫిబ్రవరి 18న ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

CCL 2023 Squad:  సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( సీసీఎల్) 2023 కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అన్ని భాషల నటీనటులు కలిసి ఆడనున్న సీసీఎల్ కు సమయం వచ్చేసింది. మొత్తం 8 ఇండస్ట్రీలు పాల్గొనే సీసీఎల్ 2023 ఎడిషన్ ఫిబ్రవరి 18న ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 19న హైదరాబాద్ ( CCL 20223 Final In Hyderabad ) లో జరుగుతుంది. ఈ సంవత్సరం సీసీఎల్ లో మొత్తం 8 జట్లు పాల్గొనబోతున్నాయి. పార్లే బిస్కెట్స్ ఈ ఏడాది సీసీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. 

సీసీఎల్- 2023లో పాల్గొనే జట్లు ( List Of CCL 2023 Team)

  1. తెలుగు వారియర్స్
  2. చెన్నై రైనోస్
  3. బెంగాల్ టైగర్స్
  4. భోజ్ పురి దబాంగ్స్
  5. కర్ణాటక బుల్డోజర్స్
  6. కేరళ స్ట్రైకర్స్
  7. ముంబై హీరోస్
  8. పంజాబ్ డీ షేర్స్

టోర్నీ జరిగే తీరిలా

సీసీఎల్ 2023 టోర్నమెంట్ ( Celebrity Cricket League 2023 ) రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనుంది. టోర్నీలో ఉన్న ప్రతి జట్టు ఇంకో జట్టులో ఒక మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయి. అక్కడ మొదటి, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్లు రెండో ఫైనలిస్ట్ బెర్తును దక్కించుకుంటుంది. ఆ తర్వాత ఈ రెండు జట్లు సీసీఎల్ ఫైనల్ మ్యాచ్ లో తలపడతాయి. 

కెప్టెన్లు

  • బెంగాల్ టైగర్స్ - జిషు
  • భోజ్‌పురి దబాంగ్స్ -  మనోజ్ తివారీ
  • చెన్నై రైనోస్ -  ఆర్య
  • కర్ణాటక బుల్డోజర్స్ -  సుదీప్
  • కేరళ స్ట్రైకర్స్ - కుంచాకో బోబన్
  • ముంబై హీరోస్ - రితేష్ దేశ్‌ముఖ్
  • పంజాబ్ డి షేర్ -  సోనూ సూద్
  • తెలుగు వారియర్స్ –  అఖిల్ అక్కినేని

తెలుగు వారియర్స్ స్క్వాడ్ ( Telugu Warriors Squad )

అఖిల్ అక్కినేని (కెప్టెన్), వెంకటేష్, సచిన్ జోషి, సుధీర్ బాబు, తరుణ్, ప్రిన్స్ సెసిల్, సాయిధరమ్ తేజ్, అజయ్, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నందకిషోర్, విశ్వ, నిఖిల్, ప్రభు, రఘు, సుశాంత్, శ్రీకాంత్, సామ్రాట్ రెడ్డి. 

Published at : 12 Feb 2023 07:17 PM (IST) Tags: CCL 2023 Telugu Warriors Celebrity Cricket League 2023 CCL 2020 edition

సంబంధిత కథనాలు

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్