By: ABP Desam | Updated at : 27 Dec 2022 05:30 PM (IST)
Edited By: nagavarapu
డేవిడ్ వార్నర్ (source: twitter)
Boxing Day Test: తన వందో టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. 100వ మ్యాచ్ ఆడుతూ ద్విశతకం చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సుదీర్ఘ జట్టులో స్థానం ప్రశ్నార్థకమైన వేళ, ప్రతిష్టాత్మకంగా భావించే బాక్సింగ్ డే మ్యాచులో, తన వందో టెస్టులో డబుల్ సెంచరీ మార్కును అందుకోవడం వార్నర్ కు ప్రత్యేకంగా నిలిచింది.
బ్యాట్ తోనే సమాధానం
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో దక్షిణాఫ్రికాతో టెస్టులో ఓపెనర్ గా దిగిన వార్నర్... డబుల్ సెంచరీని అందుకున్నాడు. నాణ్యమైన ప్రొటీస్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ అతడు చేసిన ఈ ద్విశతకం ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. టెస్టు జట్టులో నుంచి తీసేయాలంటూ వస్తున్న విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడీ విధ్యంసక బ్యాట్స్ మెన్. మొత్తం 254 బంతులు ఎదుర్కొని 200 పరుగులు చేశాడు. అందులో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ ద్విశతకంతో అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ తర్వాత వందో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు.
రెండో ఆటగాడిగా గుర్తింపు
ఇప్పటివరకు వార్నర్ తన కెరీర్ లో 25 టెస్ట్ సెంచరీలు చేశాడు. అలాగే 3 ద్విశతకాలు బాదాడు. ఎంసీజీలోని ఉక్కబోత వాతారణంలో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. డబుల్ సెంచరీ అందుకున్న తర్వాత తనకు అలవాటైన రీతిలో వార్నర్ సంబరాలు చేసుకున్నాడు. ప్రేక్షకులలో ఉన్న వార్నర్ భార్య కాండీస్, అతని పిల్లలు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. అయితే డబుల్ సెంచరీ తర్వాత డేవిడ్ వార్నర్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. చాలాసేపటి నుంచి బ్యాటింగ్ చేస్తుండటంతో అతను తిమ్మిర్లకు గురయ్యాడు. దాంతో మైదానాన్ని వీడాడు.
After a tremendous knock in scorching heat, @davidwarner31 walks off to a standing ovation for an incredibly well-earned sit down 🥵 pic.twitter.com/knNy6abf9s
— Cricket Australia (@CricketAus) December 27, 2022
ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్ట్ వివరాలు
ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసింది. ట్రావెస్ హెడ్ (48), అలెక్స్ కారీ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రొటీస్ బౌలర్లలో రబాడ, నోర్జే లు తలా వికెట్ తీసుకున్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగి ప్రొటీస్ ను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 197 పరుగుల ఆధిక్యంలో ఉంది.
David Warner becomes only the second batter to score a double hundred in their 100th Test 🙌
— ICC (@ICC) December 27, 2022
Watch #AUSvSA LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/FKgWE9jUq4 pic.twitter.com/lXfn50rf5C
Australia dominate day two in Melbourne 💪
— ICC (@ICC) December 27, 2022
Watch #AUSvSA LIVE on https://t.co/hKQJhPsoED (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/J0yQTZsCrj pic.twitter.com/mjJSFTBRhT
IND Vs AUS: మొదటి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ - గాయంతో కీలక ఆటగాడు దూరం!
IND vs NZ: ఆ రికార్డు సృష్టించిన మొదటి భారత ఆల్రౌండర్ హార్దికే - ఏంటో తెలుసా?
Ashwin On Steve Smith: మీ స్లెడ్జింగ్, మైండ్గేమ్స్ మాకు తెలుసులే! ఆసీస్కు యాష్ పవర్ఫుల్ పంచ్!
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!
WPL Auction 2023: ఏంటీ పోటీ! WPL వేలంలో 90 మందికి 1000 పేర్లు నమోదు!
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్