అన్వేషించండి

Ind Vs Ban: టీమిండియా ఫైనల్ 11 ఇదేనా! , బౌలింగ్‌ కోచ్‌ ఏం చెప్పాడంటే..?

Odi World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గతంలో చాలాసార్లు టీమిండియాకు షాక్‌ ఇచ్చిన బంగ్లా పులులు... మళ్లీ షాక్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. అయితే టీమిండియా పాకిస్థాన్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుందా లేక మార్పులేమైనా ఉంటాయా అన్న సందేహం క్రికెట్‌ అభిమానులకు ఉత్పన్నమవుతోంది. దీనిపై టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే స్పందించాడు. ఈ ప్రపంచకప్ విజయాల పరంపర కొనసాగించడమే తమ మొదటి ప్రాధాన్యత అని పరాస్ మాంబ్రే స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగబోతున్నట్లు మాంబ్రే తెలిపాడు. జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని సూచనప్రాయంగా మాంబ్రే ధ్రువీకరించడంతో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
 
ఐదుసార్లు ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్తాన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘ విజయాలతో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం అప్రతిహాతంగా సాగుతోంది. కీలకమైన, సమర్థమైన ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేసే సవాలును కూడా టీమిండియా స్వీకరిస్తున్నట్లు మాంబ్రే తెలిపాడు. ఆ మ్యాచ్‌లో జట్టు ప్రయోజనాలు, మ్యాచ్‌ ఆడే పరిస్థితులు, ప్రత్యర్థి జట్టు బలహీనతలు, వాతవరణ పరిస్థితులు ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుని తుది జట్టు ఎంపిక ఉంటుందని మాంబ్రే తెలిపారు.షమీ, సూర్యకుమార్ యాదవ్‌, రవిచంద్రన్ అశ్విన్‌లను బెంచ్‌కే పరిమితం చేయడం చాలా కష్టమైన పనని అంగీకరించాడు. వాళ్లు అద్భుతమైన ఆటగాళ్లని గుర్తు చేశాడు.
 
మీడియా సమావేశంలో మాట్లాడిన మాంబ్రే గత విజయాల ఊపును కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని.. షమీ వంటి నాణ్యమైన ఆటగాళ్లను ప్లేయింగ్‌ లెవన్‌లో ఆడించకపోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికే ఆ ఆటగాళ్లతో చర్చలు జరిపినట్లు వెల్లడించాడు. అటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులభం కాదని, కానీ ఆటగాళ్లతో తాము స్పష్టమైన చర్చలు జరిపినట్లు తెలిపాడు. పరిస్థితులకు సరిగ్గా సరిపోయే జట్టును ఎంపిక చేస్తామని మాంబ్రే వ్యాఖ్యానించారు. 
 
సూర్యకుమార్ యాదవ్‌ ఒక ఛాంపియన్ అని  మ్యాచ్ విన్నర్ అని.. కానీ ప్రస్తుత లైనప్‌లో అతనికి స్థానం కల్పించడం ఒక సవాల్‌గా మారిందని మాంబ్రే పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చి అసాధారణ ప్రదర్శన చేస్తుండడంపై మాంబ్రే హర్షం వ్యక్తం చేశారు. బుమ్రా బౌలింగ్‌తో టీమిండియా బౌలింగ్‌ దళం చాలా మెరుగ్గా కనిపిస్తుందని వ్యాఖ్యానించాడు. కుల్దీప్‌ యాదవ్‌ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. కుల్దీప్ వేగం, మెరుగైన ఖచ్చితత్వం ఇప్పుడు అతనిని ప్రత్యేక బౌలర్‌గా నిలిపిందని తెలిపాడు. తాము ప్రతీ మ్యాచ్‌ను సీరియస్‌గానే తీసుకుంటున్నట్లు పరాస్‌ మాంబ్రే స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌ను ఆఫ్ఘానిస్తాన్ ఓడించడం... దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడాన్ని పరాస్‌ గుర్తు చేశాడు. తాము ప్రతీ ప్రత్యర్థిని గౌరవిస్తామని.. ఆ జట్లకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తామని స్పష్టం చేశాడు. 
 
టీమిండియా ప్లేయింగ్‌ లెవన్(అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
OTT Friday Movie Release: ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి
ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి
Amazon And Flipkart Sellers : ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ ఫోకస్- హైదరాబాద్‌సహా 19 ప్రాంతాల్లో సోదాలు
ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ ఫోకస్- హైదరాబాద్‌ సహా 19 ప్రాంతాల్లో సోదాలు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Embed widget