By: ABP Desam | Updated at : 26 Feb 2023 04:15 PM (IST)
Edited By: nagavarapu
మహాకాళేశ్వర ఆలయంలో కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులు
Border Gavaskar Trophy: ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. వివాహం తర్వాత తొలిసారి ఈ జంట కలిసి ఆలయానికి వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన బాబా మహాకాల్ ఉజ్జయిని భస్మ హారతికి హాజరయ్యారు. అలాగే అక్కడి లింగానికి అభిషేకం చేశారు. స్వామి దర్శనం పూర్తయ్యాక రాహుల్- అతియాలు నంది హాలులో కూర్చుని ధ్యానం చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణం అంతా తిరిగారు.
KL Rahul & Athiya Shetty visited Mahakaleshwar Temple in Madhya Pradesh. pic.twitter.com/R4zvZwzcmM
— Johns. (@CricCrazyJohns) February 26, 2023
పేలవ ఫాంలో రాహుల్
కొన్నేళ్లుగా ప్రేమించుకున్న భారత క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టిలు ఇటీవలే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక క్రికెట్ విషయానికొస్తే ప్రస్తుతం రాహుల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. కొన్నాళ్లుగా టెస్ట్ క్రికెట్ లో పేలవ ప్రదర్శన చేస్తున్న ఈ ఓపెనర్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనూ విఫలమవుతున్నాడు. తొలి రెండు టెస్టుల్లోనూ నిరాశపరిచాడు. ఈ క్రమంలో తర్వాతి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో ఉన్నప్పటికీ.. వైస్ కెప్టెన్సీ పదవిని కోల్పోయాడు. పేలవ ఫాంలో ఉన్న రాహుల్ కు బదులు మూడో టెస్టులో శుభ్ మన్ గిల్ ను ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు.
Jab insaan har jagah se haar jaata hai to bhagwan hi sahara dete hain 💙🧡🙏#KLRahulpic.twitter.com/YT2HHmTv33
— Prayag (@theprayagtiwari) February 26, 2023
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియాపై 2-0 ఆధిక్యంలో ఉంది. తొలి 2 టెస్టులను గెలుచుకుంది. మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1న ప్రారంభం కానుంది.
KL Rahul and Athiya Shetty at the Mahakaleshwar Jyotirlinga Temple. pic.twitter.com/KQ1q04nuYg
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2023
KL Rahul reached Mahakal temple with wife Athiya Shetty before Ind vs Aus 3rd test match in Indore! 🙏❤️pic.twitter.com/dbrQ4Y3njU
— Kunal Yadav (@kunaalyaadav) February 26, 2023
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్ టార్గెట్ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!
UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!
RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్ 'కెర్' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్ టాపర్!
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?