Women Umpires in Ranji: బీసీసీఐ కీలక నిర్ణయం- రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు
Women Umpires in Ranji: క్రిెకెట్ లో మహిళలకు ప్రోత్సాహం అందించే విధంగా బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సీజన్ లో బీసీసీఐ మహిళా అంపైర్లను బరిలో దించనుంది.
Women Umpires in Ranji: క్రిెకెట్ లో మహిళలకు ప్రోత్సాహం అందించే విధంగా బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచులకు పురుష అంపైర్లే ఉండేవారు. అయితే వచ్చే రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లకు బీసీసీఐ ప్రాధాన్యం ఇవ్వనుంది
ఈ నెల 13న ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సీజన్ లో బీసీసీఐ మహిళా అంపైర్లను బరిలో దించనుంది. ఈ సీజన్ కు వృందా రాఠి (ముంబై), గాయత్రి వేణుగోపాలన్ (దిల్లీ), జనని నారాయణ్ (చెన్నై) అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గతంలో గాయత్రి ఫోర్త్ అంపైర్ గా విధులు నిర్వర్తించారు. అయితే మహిళా అంపైర్లు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తుండడం భారత క్రికెట్ లో ఇదే తొలిసారి.
Remarkable!@BCCI has appointed 3 women umpires for #RanjiTrophy matches this season. Their appointment in the men's domestic circuit is a great step towards making the game more inclusive & empowering women in sports. https://t.co/9vjFyRq5dX pic.twitter.com/pj4rEg0IbP
— Dhanraj Nathwani (@DhanrajNathwani) December 6, 2022