MS Dhoni: ధోని కెరీర్‌లో టర్నింగ్స్ పాయింట్స్ అవే - మాజీ సెలక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సుదీర్ఘ ప్రయాణంలో కీలక మలుపుల గురించి మాజీ సెలక్టర్ సబా కరీం ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
MS Dhoni: భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోని దేశం గర్వించదగ్గ సారథి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా భారత జట్టులోకి వచ్చిన అతడు.. కీపింగ్, బ్యాటింగ్‌లో తనదైన మార్కును చూపించడమే గాక సారథిగా కూడా అద్భుత విజయాలను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి తప్పుకున్నా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్స్ గురించి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్, ధోనీతో కలిసి ఆడిన సబా కరీం ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని మాట్లాడుతూ...‘ధోనీతో నా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. నేను ధోనిని మొదటిసారి అతడి రెండో రంజీ సీజన్ సందర్భంగా చూశాను. అప్పుడతడు బీహార్‌కు ఆడేవాడు. నేను అతడి బ్యాటింగ్, కీపింగ్ చాలా నిశితంగా గమనించాను. బ్యాటింగ్ చేసేప్పుడు అతడు ఆడే లాఫ్టెడ్ షాట్స్ అద్భుతంగా అనిపించేవి. స్పిన్నర్, పేసర్‌లను ఎదుర్కోవడంలో అప్పటికే పరిణితి సాధించాడు...
కానీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో అతడి ఫుట్‌వర్క్‌లో కొన్ని లోపాలుండేవి. నేను ఆ విషయాన్ని ధోనీకి చెప్పాను. ఇప్పటికీ ధోని నాతో కలిసినా ఎప్పుడైనా మాట్లాడినా నాతో అదే విషయం ప్రస్తావిస్తుంటాడు. నేను అప్పుడు ధోనికి ఏం చెప్పానదానిని ధోని ఇప్పటికీ నాతో మాట్లాడుతుంటాడు. వాస్తవానికి ధోని కెరీర్‌లో అది టర్నింగ్ పాయింట్ అయింది..’ అని చెప్పాడు.
ఇక ధోని కెరీర్‌లో రెండో టర్నింగ్ పాయింట్ గురించి చెబుతూ.. ‘ధోని ఇండియా-ఎ టీమ్‌కు ఆడినప్పుడు కెన్యాలో పాకిస్తాన్ - ఎ తో కలిసి ముక్కోణపు సిరీస్ జరిగింది. ఆ సిరీస్‌కు ముందే దినేశ్ కార్తీక్‌కు జాతీయ జట్టులో అవకాశం రావడంతో అతడు వెళ్లిపోయాడు. దీంతో ధోనికి ఇండియా-ఎ టీమ్‌లో చోటు దక్కింది. ఆ సిరీస్‌లో ధోని.. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ సిరీస్‌లో మేం పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌లు ఆడితే రెండింట్లో గెలిచాం. అది కూడా ధోని కెరీర్‌కు చాలా ప్లస్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తుంది.. నేను ఓసారి కోల్‌కతాకు వెళ్లాను. అక్కడ దాదా (అప్పటి భారత జట్టు సారథి గంగూలీ)ను కలిసి ధోని గురించి చెప్పాను. అతడిని జాతీయ జట్టులోకి తీసుకొస్తే బాగుంటుందని దాదాకు వివరించాను. అయితే అప్పుడే భారత జట్టు పాకిస్తాన్ టూర్‌కు వెళ్లింది. కానీ దాదా ఆ టూర్ తర్వాత ధోని ఆటను చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత ఇక అంతా చరిత్రే..’అని కరీం చెప్పుకొచ్చాడు.
"why are you crying? it's just a picture"
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
the picture: 🥹 pic.twitter.com/JIWEGfpjDL
Win-tage Cars ft.Thala! #WhistlePodu #Yellove🦁💛 @msdhoni pic.twitter.com/3Z7bb9qPiN
— Chennai Super Kings (@ChennaiIPL) August 3, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial